Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

11-Nov-2016 13:14:11
facebook Twitter Googleplus
Photo

బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ రాకేష్ రోషన్ కాంబినేషన్ లో వస్తోన్న భారీ ఆక్షన్ థ్రిల్లర్ "కాబిల్". ఈ చిత్రానికి తెలుగు టైటిల్ "బలం" అని ఖరారు చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలయ్యింది. ఈ మేరకు చిత్ర బృందం సోషల్ మీడియా లో ఈ పోస్టర్ ను విడుదల చేసింది. గతంలో క్రిష్ - క్రిష్ 3 - కోయి మిల్ గయా - కహో నా ప్యార్ హై వంటి సూపర్ హిట్ చిత్రాలను అందించిన ఈ కాంబినేషన్ ఇప్పుడు మళ్ళీ "బలం"తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. గతంలో హృతిక్ సూపర్ హిట్ సినిమాలు తెలుగులోనూ భారీ విజయాలే నమోదు చేశాయి. దీంతో మరోసారి హృతిక్ సినిమాని నేరుగా తెలుగులో విడుదలచేస్తున్నారు!

ఈ సందర్భంగా... " యాక్షన్ డ్రామా తో పాటుండే చక్కటి లవ్ స్టోరీ ఈ సినిమా అని ఈ సినిమా హిందీ ట్రైలర్ కి యూట్యూబ్ లో వచ్చిన రికార్డ్ బ్రేకింగ్ వ్యూసే (48 గంటల్లో 25 లక్షలు) ఈ సినిమాపై ఉన్న అంచనాలకు ఉదాహరణలని చెబుతుంది. కాగా సంజయ్ గుప్తా దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా జనవరి 26 2017 న విడుదల అవుతుంది. ఈ చిత్రంలో హృతిక్ సరసన యామీ గౌతమ్ హీరోయిన్ గా నటిస్తోంది.

ఈ సినిమాకు సంబందించిన ఆంధ్రా నిజాం ఏరియా హక్కులను రాజశ్రీ సంస్థ దక్కించుకోగా కర్ణాటక హక్కులను యాష్ రాజ్ సంస్థ దక్కించుకుంది. మళయాలం హక్కులను ప్రఖ్యాత నటుడు మోహన్ లాల్ దక్కించుకోవడం విశేషం!

,  ,  ,  ,  ,