Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

12-May-2016 12:46:22
facebook Twitter Googleplus
Photo

సూర్య హీరోగా నటించిన ?24? సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతోన్న విషయం తెలిసిందే. తెలుగులో దర్శకుడిగా తనదైన బ్రాండ్ సృష్టించుకున్న విక్రమ్ కుమార్ తెరకెక్కించిన సినిమా కావడంతో ?24?కు మొదట్నుంచీ తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఇక సినిమా కూడా అందరికీ ఓ సరికొత్త అనుభూతిని పంచడంతో సూపర్ పాజిటివ్ టాక్‌తో కలెక్షన్స్ వర్షం కురుస్తోంది. తమిళనాట సూర్యకు ఉన్న స్టార్ స్టేటస్ ప్రకారంగా కలెక్షన్స్ ఓ రేంజ్‌లో ఉంటే, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కలెక్షన్స్ అదే స్థాయిలో ఉండడం విశేషంగా చెప్పుకోవచ్చు.
ఇక ఈ నేపథ్యంలోనే తమ సినిమాకు ఈ స్థాయి విజయాన్ని తెచ్చిపెట్టిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతూ, హైద్రాబాద్‌లో ?24? టీమ్ సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేసింది. వేరే ఇతర పనుల్లో బిజీగా ఉండి సూర్య, సమంత ఈ వేడుకకు హాజరు కాలేకపోయినట్లు తెలుపుతూ, దర్శకుడు విక్రమ్ కుమార్ ఈ సమావేశంలో వారి తరపున ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక ఈ సందర్భంగానే ఆయన మాట్లాడుతూ.. ?ఈ సినిమాకు ఇంత పెద్ద విజయాన్ని తెచ్చిపెట్టిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. సూర్య ఈ సినిమాను స్వయంగా నిర్మించి, నాకు అన్నివిధాలా సహకరించారు. ?24? టీమ్ మొత్తం కష్టపడితే ఈ ఫలితం వచ్చింది. ఈ సినిమాకు పనిచేసినవారందరికీ మళ్ళీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. ?ఇష్క్?, ?మనం?, ఇప్పుడీ ?24? వరుసగా నా సినిమాలను ఆదరిస్తోన్న తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ ఋణపడి ఉంటా? అని అన్నారు.
ఇక ఈ సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరించిన రాజశేఖర్ పాండియన్ మాట్లాడుతూ.. ?తెలుగు ప్రేక్షకుల సపోర్ట్ గురించి సూర్య ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటారు. ఆయన యూఎస్‌లో ఉండి ఇక్కడికి రాలేకపోయారు. ఆయన తరపున తెలుగు ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఈ సక్సెస్ చూశాక నాకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా తెలియట్లేదు. తెలుగు ప్రేక్షకులకు పాదాభివందనాలు? అన్నారు. ఇక సినిమాలో ఓ కీలక పాత్రలో నటించిన అజయ్ మాట్లాడుతూ.. ?ఇష్క్‌తో నా కెరీర్‌కు ఓ కొత్త దారి చూపిన విక్రమ్ సార్, ఈ సినిమాతో నన్ను మరోస్థాయికి తీసుకెళ్ళారు. ఆయనకు నేను ఏ విధంగా థ్యాంక్స్ చెప్పినా సరిపోదు? అన్నారు. ఇక ఈ సినిమాకు ఎడిటర్‌గా పనిచేసిన ప్రవీణ్ పూడి మాట్లాడుతూ.. ?విక్రమ్ కుమార్ సార్ లేకపోతే నేను తమిళ పరిశ్రమకు, ఇంత పెద్ద సినిమాతో పరిచయమయ్యేవాడిని కాదు. సూర్య గారి సినిమాతో తమిళంలో పరిచయమవ్వడం అదృష్టంగా భావిస్తున్నా? అన్నారు.

,  ,  ,  ,