Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

04-Jul-2016 14:08:27
facebook Twitter Googleplus
Photo

హైదరాబాద్: కొన్ని రోజులుగా అక్కినేని యంగ్ హీరోల ప్రేమాయణం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. నాగ చైతన్య హీరోయిన్ సమంతతో ప్రేమలో పడగా, అఖిల్ తన ప్రెండ్ శ్రేయ భూపాల్ తో లవ్ రిలేషన్ షిప్ మెయింటేన్ చేస్తున్నాడు. ఈ ఇద్దరు స్టార్ తమ లవ్ మ్యాటర్ అఫీషియల్ గా ప్రకటించక పోయినా... తన ఇద్దరు కుమారులు తమకు తగిన జోడీలను ఎంచుకోవడం ఆనందంగా ఉందని కామెంట్ చేయడం ద్వారా నాగార్జున పరోక్షంగా విషయం ఖరారు చేసారు. అక్కినేని ఫ్యామిలీ సన్నిహితుల ద్వారా తాజాగా ఓ ఆసక్తికర విషయం బయటకు లీకైంది. ఈ ఏడాది చివర్లో... అంటే డిసెంబర్లో అక్కినేని వారి ఇంట్లో పెళ్లి భాజాలు వినిపించబోతున్నాయట. ఇద్దరు కుమారుల వివాహం ఒకేసారి గ్రాండ్ గా జరిపేందుకు నాగార్జున ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన సెలబ్రిటీల్లో ఇప్పటి వరకు జరిగిన గ్రాండ్ మ్యారేజిలన్నింటినీ తలదన్నేలా ఈ వివాహం చేయబోతున్నారు. హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియో వీరి వివాహ వేడుకకు వేదిక కాబోతోందని తెలుస్తోంది. దిక్షిణాది, ఉత్తరాది సినీ ప్రముఖులందరూ హాజరైనా సరిపోయేలా విశాల మైన వివాహ వేదిక వేస్తారని తెలుస్తోంది.

,  ,  ,  ,  ,  ,