Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

23-May-2015 10:26:12
facebook Twitter Googleplus
Photo

'ఊహలు గుసగుసలాడే' సినిమాలో నాగశౌర్యను చూసినవాళ్లు... తెలుగు తెరకి చాక్లెట్ లాంటి కుర్రాడు దొరికాడని అనుకున్నారు. ఆ తరువాత 'దిక్కులు చూడకు రామయ్య'తో అదే క్రేజ్ ను కొనసాగించిన ఈ కుర్రాడు, తాజాగా మాస్ ఆడియన్స్ ని పలకరించే ప్రయత్నం చేస్తున్నాడు. కాస్త రఫ్ లుక్ తో కనిపిస్తూ .. యాక్షన్ సీన్స్ లోను తన సత్తా చూపడానికి 'జాదూగాడు'గా జూన్ 5న వస్తున్నాడు. వీడు చాలా జాదూగాడ్రా అని విలన్ బృందంతో అనిపించనున్నాడు.

వి.వి.ఎన్.ప్రసాద్ నిర్మాణంలో యోగేష్ తెరకెక్కించిన ఈ సినిమాలో సోనారిక కథానాయికగా కనిపించనుంది. మహతి స్వరపరచిన పాటలు యూత్ ని ఆకట్టుకునేలా వున్నాయని అంటున్నారు. లవ్ .. కామెడీ .. యాక్షన్ అంశాలను మేళవించి రూపొందించిన ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకూ చేస్తూ వచ్చిన సినిమాలకి భిన్నంగా నాగశౌర్య చేసిన ఈ సినిమా ఆయనకి ఎంతవరకూ కలిసొస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

,  ,  ,  ,  ,