Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

07-May-2015 11:44:59
facebook Twitter Googleplus
Photo

కథానాయకులు పోషించే పాత్రను బట్టి ఆయా సినిమాల పట్ల ప్రేక్షకులలో ఆసక్తి పెరుగుతూ వుంటుంది. అందువల్లనే ఆ కథానాయకుడు పోషించే పాత్రను గురించి ముందుగానే ప్రస్తావిస్తుంటారు. అలా తాజాగా రూపొందిన 'హితుడు' సినిమా విషయంలోకి వెళితే ఈ సినిమాలో కథానాయకుడైన జగపతిబాబు, మావోయిస్ట్ గా కనిపించనున్నాడు. దర్శక నిర్మాతలు ఈ సినిమా మోషన్ పోస్టర్ ని నిన్ననే విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో జగపతిబాబు మాట్లాడాడు. 'హితుడు' అంటే మంచిని కోరేవాడని అర్థం. మనిషిలోని మానవీయ కోణాన్ని సందేశాత్మకంగా ఆవిష్కరించిన సినిమా ఇదని చెప్పాడు.

కథాపరంగా తాను ఈ సినిమాలో ఓ సాధారణమైన టీచర్ గాను, పరిస్థితుల వలన మారిన మావోయిస్టుగా భిన్నమైన పాత్రల్లో కనిపిస్తానని అన్నాడు. ఈ సినిమా తాను ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని చేసినది కాదనీ, కథ నచ్చడం వలన .. సమాజానికి అవసరమైన సందేశం ఉండటం వలన చేసిన సినిమా అని చెప్పాడు.మీరా నందన్ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

,  ,  ,  ,