Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

16-Sep-2017 15:33:09
facebook Twitter Googleplus
Photo

ప్రమోషన్స్ ఈ మధ్య కాలంలో సినిమాకి కలెక్షన్స్ కి చాలా బూస్ట్ లాంటిదనే చెప్పాలి. ఒక్కోసారి మంచి కథ ఉన్నా సినిమా ప్రమేషన్స్ లేకపోతె జనాలు పట్టించుకోరు. అలాగే ఎప్పుడో ఒకప్పుడు ప్రమోషన్స్ చేయకున్నా సినిమా హిట్ కావచ్చు. అయితే ప్రస్తుత రోజుల్లో మాత్రం ఎంత పెద్ద సినిమాకైనా ఎంత చిన్న సినిమాకైనా ప్రమోషన్స్ భారీ స్థాయిలో నిర్వహించాల్సిందే. సినిమా ఎన్ని కోట్లు పెట్టి తీసినా చిత్ర నిర్మాతలు ప్రమోషన్స్ కోసం కాస్త డబ్బును సపరేట్ గా ముందే రెడీ చేసుకుంటున్నారు.

అయితే కొంతమంది హీరోలు వారు నటించిన సినిమా కోసం బాధ్యతను తీసుకొని పలు రకాలుగా ప్రమోషన్స్ నిర్వహిస్తుంటారు. ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కూడా అదే తరహాలో ట్రై చేస్తున్నాడు. మొదటి సారి "జై లవ కుశ" అనే సినిమాలో ద్విపాత్రాభినయం చేసిన ఎన్టీఆర్ సినిమాకు హైప్ తెచ్చేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటివరకు ట్రైలర్స్ తో సాంగ్స్ తో వెండితెర ప్రేక్షకులను ఆకట్టుకున్న ఎన్టీఆర్ అలాగే బుల్లి తెర ప్రేక్షకులను కూడా థియేటర్స్ వరకు రప్పించేందుకు ప్లాన్స్ వేస్తున్నాడు. ఇప్పటికే బిగ్ బాస్ షోతో వారికి ఎన్టీఆర్ బాగా దగ్గరయ్యాడు. ఈ షోలో సినిమా ప్రమోషన్స్ కోసం ఇంతకుముందు చాలా మంది నటీనటులు వచ్చిన విషయం తెలిసందే.

కానీ తాను హోస్ట్ చేస్తున్న షోలోనే ఎన్టీఆర్ మొదటి తన సినిమా ప్రమోషన్స్ ని నిర్వహించబోతున్నాడు. అందుకోసం సినిమాలో నటించిన హీరోయిన్స్ రాశి ఖన్నా - నివేద థామస్ రీసెంట్ గా బిగ్ బాస్ షోలోకి ఆహ్వానించాడు ఎన్టీఆర్. అయితే ఆ ఎపిసోడ్ ఈ శనివారం ప్రసారం కాబోతోంది. ఈ శని ఆదివారపు ఎపిసోడ్ లో జై లవకుశ స్థాయిని ఇంకా పెంచేలా ఎన్టీఆర్ సూపర్బ్ గా షోని నడిపించాడని తెలుస్తోంది. ఈ ఎపిసోడ్ చాలా హిట్ అవుతుందని షో నిర్వాహకులు కూడా నమ్మకంతో ఉన్నారు.

,  ,  ,  ,