వరుసపెట్టి ఏ సినిమా గురించైనా రూమర్లు వస్తున్నాయంటే.. ఖచ్చితంగా అది జై లవ కుశ గురించే. ఎందుకంటే ఈ సినిమాతో పాటుగా ప్యారలల్ గా జూనియర్ ఎన్టీఆర్ బిగ్ బాస్ షూటింగులో కూడా పాల్గొనడం వలన.. ఈ సినిమాను కాస్త లేటు చేస్తున్నాడనే టాక్ వచ్చింది. అలాగే సెప్టెంబర్ 21న ఈ సినిమా రాకపోతే శర్వానంద్ మహానుభావుడు ఆ డేట్ న వస్తుందని మరో రూమర్ కూడా వచ్చింది. దానితో ఒక్కసారి ఫ్యాన్స్ అందరూ షాకయ్యారు.
నిజానికి ఎన్టీఆర్ చేస్తున్న పనంతా కూడా తన షెడ్యూల్ ప్రకారమే జరుగుతోందట. అయితే ఇప్పుడు రూమర్లతో విస్తుపోయిన కళ్యాణ్ రామ్.. అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చేశాడు. అసలు జై లవ కుశ గురించి వస్తున్న రూమర్లలో నిజంలేదు. సెప్టెంబర్ 21న సినిమా వస్తోందంతే. లవ క్యారక్టర్ కు సంబంధించిన టీజర్ ఎప్పుడు రిలీజ్ చేస్తోంది మరి కొన్ని రోజుల్లో చెబుతాం అంటూ ఎన్టీఆర్ ఆర్ట్స్ వారు ఒక అఫీషియల్ ప్రకటనలో తెలియజేశారు. కాబట్టి ఇప్పుడు ఫ్యాన్స్ ఎవ్వరూ కూడా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. దసరా రేసులో పండగను ఒక వారం ముందే తెస్తున్నాడు తారక్. అంతే!!
ఇప్పటికే జై లవ కుశ సినిమా నుండి జై టీజర్ ను రిలీజ్ చేసి.. చాలా బజ్ క్రియేట్ చేశారు. అయితే లవ క్యారక్టర్ కాస్త కూల్ అండ్ నార్మల్ గా ఉన్నప్పటికీ టీజర్ తో మాత్రం బజ్ సృష్టిస్తారని తెలుస్తోంది.