Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

22-Dec-2017 10:19:36
facebook Twitter Googleplus
Photo

సంక్రాంతిని మిస్ అయినా బాలయ్య మాత్రం అస్సలు మిస్ కాడు అనేది అందరికి తెలిసిన విషయమే. పరిస్థితులు ఎలా ఉన్నా కూడా సినిమాను పూర్తి చేసి సంక్రాంతి పోటీలో నిలబడతాడు. ఎన్ని సినిమాలు విడుదలకు సిద్దమైనా కూడా ఏ మాత్రం భయపడకుండా బాలయ్య తన సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేస్తుంటాడు. అదే తరహాలో ఈ సారి జయ సింహాతో రాబోతున్నాడు.

రీసెంట్ గా చిత్ర యూనిట్ టీజర్ ని కూడా రిలీజ్ చేసింది. అయితే టీజర్ లో బాలయ్య ఎప్పటిలానే తన మాస్ యాక్షన్ తరహా శైలిని చూపించాడు. తన అభిమానులకు ఇష్టమయ్యే విధంగా ఫైట్స్ తో డైలాగులతో చాలా రోజుల తరువాత దర్శనం ఇచ్చాడు. బాలయ్య చెప్పిన డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతోంది. "సింహం మౌనాన్ని సన్యాసం అనుకోవద్దు.. సైలెంట్ గా ఉందని కెలికితే తల కొరికేస్తది" అనే డైలాగ్ ఇప్పుడు అందరిని ఆకట్టుకుంటోంది.

ముఖ్యంగా బాలయ్య అభిమానులు పండగ చేసుకుంటున్నారు. తప్పకుండా ఈ సంక్రాంతి కూడా బాలయ్య తన హవాను కొనసాగిస్తాడని చెబుతున్నారు. పైసా వసూల్ తో నిరాశపరిచిన బాలయ్య జయ సింహతో బాక్స్ ఆఫీస్ వసూళ్లు విషయంలో రచ్చ చేస్తాడని అంటున్నారు.

,  ,  ,  ,  ,  ,