Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

08-Sep-2016 11:55:40
facebook Twitter Googleplus
Photo

మిర్చి సినిమా విడుదలైన మూడు వారాల తర్వాత ఓ వర్షం ఫైట్ యాడ్ చేయించాడు కొరటాల శివ. కోటి రూపాయలకు పైగా ఖర్చు పెట్టి తీసిన ఆ ఫైట్ బాగానే జనాల్ని ఆకర్షించింది. ఆ తర్వాత కొరటాల రెండో సినిమా ?శ్రీమంతుడు?కు కూడా రెండు వారాల తర్వాత కొత్త సీన్లు కలిశాయి. రిలీజ్ తర్వాత సన్నివేశాలు కలపడాన్ని సెంటిమెంటుగా భావించాడో ఏంటో.. ముందే కొన్ని సన్నివేశాలు ఎడిటింగ్ లో తీసి పెట్టాడు కొరటాల. సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూసి విడుదల తర్వాత రెండో వారంలో ఆ సన్నివేశాలు కలుపుతామని ముందే చెప్పిన కొరటాల.. అన్నట్లే చేశాడు. రెండో వారం నుంచి ?జనతా గ్యారేజ్?కు కొత్త సన్నివేశాలు కలుస్తున్నాయి.

ఆ సన్నివేశాలు ఏవో ఏంటో కానీ.. బుధవారం నుంచి వాటిని థియేటర్లలో చూసుకోవచ్చు. సినిమాలో ఎన్టీఆర్ ఎలాంటి ఇంట్రడక్షన్ లేకుండా నేరుగా పాటతో పరిచయమవుతాడన్న సంగతి తెలిసిందే. ఐతే అమెరికాలో మాత్రం ఎన్టీఆర్ ఇంట్రో సీన్స్ ఉన్న వెర్షన్ ప్రదర్శితమైంది. దీంతో పాటు ఎన్టీఆర్-సమంత కాంబినేషన్లో కొన్ని సన్నివేశాల్ని కొత్తగా కలుపుతారని భావిస్తున్నారు. ఆరంభంలో వచ్చిన డివైడ్ టాక్ వచ్చినా.. తొలి వారాంతంలో అదిరిపోయే కలెక్షన్లు సాధించింది ?జనతా గ్యారేజ్?. సోమవారం తర్వాత కలెక్షన్లు కొంచెం తగ్గాయి. వీకెండ్లో మళ్లీ కలెక్షన్లు పుంజుకుంటాయని భావిస్తున్నారు. మరి కొత్త సన్నివేశాలు ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతినిస్తాయో.. సినిమాకు ఎంత ప్లస్సవ్వుతాయో చూద్దాం.

,  ,  ,  ,  ,  ,