ఎన్టీఆర్ - కొరటాల కాంబినేషన్ లో భారీ అంచనాల మధ్య ప్రపంచ వ్యాప్తంగా విడుదలయిన జనతా గ్యారేజ్.. కలెక్షన్స్ విషయంలో కూడా భారీస్థాయిలోనే దూసుకుపోతుంది. విడుదలయిన రోజునుంచి ఎన్ని ఆటంకాలొచ్చినా తన కలెక్షన్స్ ప్రభంజనాన్ని కొనసాగిస్తూనే ఉంది. ఇప్పటికే నాన్ బాహుబలి సినిమాల చరిత్రలో కేవలం ఐదురోజుల్లోనే మొదటిస్థానాన్ని ఆక్రమించిన జనతా... ఆరో రోజు చేరేటప్పటికి మిగిలిన సినిమాలకు అందనంతగా దూసుకుపోతుంది.
జనతా గ్యారేజ్ ఆరురోజుల షేర్స్ వివరాలు ఒకసారి గమనిస్తే...
ఏరియా - షేర్స్ (కోట్లలో)
నైజాం - 14.24
సీడెడ్ - 8.14
వైజాగ్ - 5.12
తూర్పు గోదావరి - 3.77
పశ్చిమ గోదావరి - 3.23
కృష్ణా - 3.42
గుంటూరు - 4.57
నెల్లూరు - 1.60
మొత్తంగా ఏపీ / నైజాం కలిసి - 44.09 కోట్ల షేర్ వ్యాల్యూ సాధించింది. మొత్తం మీద సుమారు 60.5 కోట్లతో తొలి ఆరురోజుల కలెక్షన్స్ తో దూసుకుపోతుంది జనతా గ్యారేజ్.