Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

25-Apr-2016 18:44:14
facebook Twitter Googleplus
Photo

సూపర్ స్టార్ రజినీకాంత్ కు మాత్రమే కాదు.. జూనియర్ ఎన్టీఆర్ కు సైతం జపాన్ లో మాంచి ఫాలోయింగ్ ఉంది. అక్కడ అతడి సినిమాలు భారీ స్థాయిలో రిలీజవుతుంటటాయి. బాద్ షా.. టెంపర్.. నాన్నకు ప్రేమతో లాంటి సినిమాలు రిలీజైనపుడు జపాన్ లో మంచి సందడి నెలకొంది. అక్కడ ఎన్టీఆర్ కు హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు. ఆ ఫ్యాన్స్ లో ఒకరు ఎన్టీఆర్ ను కలవడం కోసం నేరుగా హైదరాబాద్ వచ్చేశాడు. ఎన్టీఆర్ కొత్త సినిమా ?జనతా గ్యారేజ్? షూటింగ్ జరుగుతున్న ప్రదేశానికి చేరుకుని ఎన్టీఆర్ ను కలిశాడు కూడా. ఆ అభిమాని పేరు నాన్.

తన కోసం ఓ అభిమాని అంత దూరం నుంచి రావడం చూసి ఎన్టీఆర్ కూడా చాలా సంతోషించాడు. ?జనతా గ్యారేజ్? సెట్లో జపాన్ అభిమానితో కలిసి ఫొటో కూడా దిగాడు ఎన్టీఆర్. తారక్ ను కలవడం.. అతడితో కలిసి ఫొటో దిగడం మరపురాని అనుభవమని ఆ అభిమాని చెప్పాడు. ఎన్టీఆర్ కూడా అభిమానితో కలయిక పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. గతంలో జపాన్ అభిమానులు ఎన్టీఆర్ పాటలకు డ్యాన్స్ చేస్తున్న వీడియోలు ఇంటర్నెట్ లో వైరల్ అయ్యాయి. సినిమా సినిమాకూ జపాన్ లో తన ఫాలోయింగ్ పెంచుకుంటున్న ఎన్టీఆర్.. తన తర్వాతి సినిమా ?జనతా గ్యారేజ్?ను అక్కడ భారీ స్థాయిలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఈ చిత్రం ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

,  ,  ,  ,  ,  ,