Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

13-Sep-2017 11:53:55
facebook Twitter Googleplus
Photo

హీరోల్లో అత్యవసరంగా ఓ బంపర్ హిట్ అవసరమైంది మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కే. సుప్రీం సినిమా తర్వాత తేజుకి వరసగా మూడు ఎదురుదెబ్బలు తగిలాయి. అతడి తిక్క - విన్నర్ సినిమాలు బాక్సాఫీస్ ను పెద్దగా అట్రాక్ట్ చేయలేకపోయాయి. కృష్ణవంశీ డైరెక్షన్ పై ఎన్నో ఆశలు పెట్టుకుని.. ఎంతో పేరు తెస్తుందనుకుని నమ్మి కెరీర్ లోనే తొలిసారి నక్షత్రం సినిమాలో స్పెషల్ రోల్ చేశాడు. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పూర్తిగా చతికిలపడింది. దాంతో సాయిధరమ్ తేజ్ కష్టమంతా వృథా అయిపోయింది.

ఇలాంటి పరిస్థితుల్లో సాయి ధరమ్ తేజ్ తన ఆశలన్నీ తర్వాత సినిమా జవాన్ పైనే పెట్టుకున్నాడు. బి.వి.ఎస్.రవి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో కృష్ణగాడి వీర ప్రేమగాథ ఫేం మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తోంది. టీజర్ ను ఇటీవల పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేశారు. అందులో తేజు చాలా హ్యాండ్సమ్ గా కనిపించడంతో అభిమానుల్లో ఈ సినిమాపై బాగానే హోప్స్ ఏర్పడ్డాయి. జవాన్ సినిమా ఈపాటికే థియేటర్లకు రావాల్సి ఉంది. కానీ వచ్చే నెలాఖరుకు రిలీజ్ వాయిదా పడిందని తెలుస్తోంది. ఈ సినిమాలో కొన్ని సీన్లు రీషూట్ చేస్తున్నారని.. అందుకే వాయిదా వేశారని టాక్. సినిమా రషెస్ చూశాక అంత సంతృప్తిగా అనిపించక పోవడంతో తిరిగి షూట్ చేస్తున్నారట.

సినిమా రిలీజ్ కాకముందు ఎన్ని మార్పులు చేసినా తప్పులేదు. ఫైనల్ గా ప్రేక్షకుడిని మెప్పించేలా కంటెంట్ ఉండాలి. హీరో అండ్ ప్రొడ్యూసర్ నాగార్జున.. సూపర్ హిట్ట డైరక్టర్ కొరటాల శివ వంటివారు చెప్పే మాట ఇది. అప్ కోర్స్.. ఇది అందరికీ వర్తించేదే. ఎన్నిసార్లు రీ షూట్ చేశారనే దానికన్నా అల్టిమేట్ గా సినిమా ఎంత బాగుందన్నదే ముఖ్యం. కాకుంటే రీ షూట్ల కోసం మరీ డిలే చేసుకుంటూ పోతే ఖర్చు పెరిగిపోతుంది.

,  ,  ,  ,  ,