Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

02-Nov-2017 12:48:24
facebook Twitter Googleplus
Photo

విషాదాలు ఎదురవుతున్నాయి జీవితా రాజశేఖర్ ఫ్యామిలీకి. మొన్నటికి మొన్న రాజశేఖర్ తల్లి తుదిశ్వాస విడిచారు. ఆ డిప్రెషన్ లో రాజశేఖర్ కూరుకుపోయారు. అందులో భాగంగానే మొన్నా మధ్య కారు యాక్సిడెంట్ జరిగింది కూడా.

ఇదిలా ఉంటే.. తాజాగా మరో విషాదం జీవిత రాజశేఖర్ ఇంట చోటు చేసుకుంది. జీవిత అన్నయ్య మురళి శ్రీనివాస్ ఈ ఉదయం (గురువారం) మరణించారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న మురళి.. ఈ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచినట్లుగా చెబుతున్నారు.

ఆయన పార్థివ దేహాన్ని సందర్శనార్థం ఈ ఉదయం కొద్దిసేపు ఫిలింఛాంబర్ వద్ద ఉంచారు. అనంతరం మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇదిలా ఉండగా.. రాజశేఖర్ హీరోగా నటించిన పి.ఎస్.వి. గురుడ వేగ 126.18 ఎం మూవీ రేపు రిలీజ్ కానుంది.

,  ,  ,  ,  ,