Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

17-Apr-2016 11:48:15
facebook Twitter Googleplus
Photo

ప్రస్తుతం ఇండియా అంతటా సంచలనం సృష్టిస్తోంది ఒక్కటే సినిమా. పలు బాషల్లో రిలీజయ్యి.. పిల్లలూ పెద్దలూ ఎగబడుతున్న ఆ సినిమా పేరు ''జంగిల్ బుక్''. మామూలుగానే హాలీవుడ్ సినిమాలకు ఇక్కడ గిరాకి పెరిగింది. ఇకపోతే ఇప్పుడు ఈ స్టోరీ ఇండియా బ్యాక్ డ్రాప్ లో నడిచే కథ కాబట్టి.. మనోళ్లు క్యూల దగ్గర బారులు తీరుతున్నారంతే.

ఈ శుక్రవారంతో తొలి వీక్ రన్ ను పూర్తి చేసుకున్న ''జంగిల్ బుక్''.. మొదటి వారంలో 74+ కోట్లు వసూలు చేసింది. శుక్రవారం అయితే ఏకంగా 8 కోట్లు వసూలు చేసింది. మొత్తంగా 80+ కోట్లు ఈ వారంలో వచ్చేస్తే.. ఇక రెండో వారంలో ఖచ్చితంగా 100 కోట్లు మార్కును అందుకుంటుంది. అయితే సమ్మర్ హాలిడేస్ మే నెల చివరకు వరకు ఉన్నాయి కాబట్టి.. ఖచ్చితంగా జంగిల్ బుక్ సినిమా 150 కోట్లు టచ్ చేస్తుందని ట్రేడ్ వర్గాల అంచనా.

మొత్తానికి మన కంటెంట్ కంటే హాలివుడ్ వారు అందిస్తున్న క్వాలిటీ వర్కు ఇక్కడ జనాల హృదయాలను దోచుకుంటున్నాయనమాట. మోగ్లీ ని వెండితెరమీద చూడ్డానికి మరి మీరు కూడా బయలుదేరుతున్నారా?

,  ,  ,  ,  ,  ,