Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

12-Jul-2016 10:54:32
facebook Twitter Googleplus
Photo

రజనీకాంత్ అభిమానులకు శుభవార్త. చాలా రోజులుగా కబాలి చిత్రం విడుదల వాయిదా పడుతున్న విషయం తెలిసిందే.ప్రపంచ వ్యాప్తం గా రజినీ అభిమానులు ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైపోయింది. ఈ చిత్రానికి క్లీన్ ?యు? సర్టిఫికెట్ ను సెన్సార్ బోర్డు జారీ చేసింది. 152 నిమిషాల నిడివి గల ఈ చిత్రం జులై 22 న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. దీనితో చాలా కాలం గా ఆసక్తి గా ఎదురుచూస్తున్న అభిమానుల ఎదురుచూపులకు తెరపడనుంది.
ఇప్పుడు కబాలి సంబందించిన ఈ విషయమైనా సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారుతోంది. సెన్సార్ బోర్డు ?యు? సెర్టిఫికెట్ జారీ చేయడం తో అభిమానులు సోషల్ మీడియాలో తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు.ఇప్పటికే ఈ చిత్ర ట్రైలర్, టీజర్ లు యూట్యూబ్ లో రికార్డ్ సృష్టించిన సంగతి తెలిసిందే.

,  ,  ,  ,  ,