Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

21-Jul-2016 13:49:03
facebook Twitter Googleplus
Photo

సాధారణంగా రజనీకాంత్ సినిమా అంటే అభిమానులు ఎంతగానో ఎదురు చూసే సన్నివేశాల్లో ఆయన ఇంట్రడక్షన్ సన్నివేశం అతి ముఖ్యమైనది. ఆ సన్నివేశం రాగానే పూలు వెదజల్లుతూ డ్యాన్సులు చేస్తూ అభిమానులు చేసే సందడి అంతాఇంతా కాదు. ?కబాలి? సినిమాలో కూడా అలాంటి ఇంట్రడక్షన్ సీన్ ఖచ్చితంగా ఉంటుంది. ఆ సీన్ ప్రస్తుతం లీకై వాట్సాప్ లలో చక్కర్లు కొడుతున్నట్టు తెలుస్తోంది. సుమారు 2 నిముషాల నిడివి, ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో ఉన్న ఈ సన్నివేశంలో రజనీ పుస్తకం చదువుతున్న దృశ్యాలు ఉన్నాయట.
ఈ విషయంపై స్పందించిన నిర్మాత కలైపులి మాట్లాడుతూ ? ఈ లీకేజ్ వ్యవహారమంతా ఒక రూమర్. సినిమా ఎట్టి పరిస్థితుల్లో లీకేజ్ బారినపడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. అన్ని పైరెట్ సైట్ల మీదా నిఘా ఉంచాం? అన్నారు. కాబట్టి అభిమానులు కూడా ఈ లీకేజ్ సమస్యను అధిగమించాలి. ఇకపోతే ఈ చిత్రం ముందుగా సింగపూర్, మలేషియా దేశాల్లో భారతీయ కాలమానం ప్రకారం సాయంత్రం 5 గంటలకు ప్రీమియర్ షోల ద్వారా ప్రదర్శింపబడనుండి.

,  ,  ,  ,  ,  ,