Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

05-Apr-2016 10:51:20
facebook Twitter Googleplus
Photo

కబీర్ దుహాన్ సింగ్.. ఇప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ విలన్ అనాల్సిందే. గతేడాది జిల్ సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ మోడల్.. మొదటి సినిమాలో విలన్ రోల్ ని ఇరగదీసేశాడు. ఆ తర్వాత సౌత్ నుంచి ఆఫర్స్ క్యూ కట్టేశాయి. తమిళ్ లో అజిత్ కి విలన్ గా వేదాళంతో పాటు కన్నడలో చలాకీ అనే చిత్రంలోనూ నటించేశాడు. ఇక తెలుగులో అయితే.. ఏడాది వ్యవధిలో ఐదు సినిమాలు వచ్చేశాయి.

మరో మూడు రోజుల్లో విడుదల కానున్న పవర్ స్టార్ మూవీ సర్దార్ గబ్బర్ సింగ్ లో కూడా కబీర్ మెయిన్ విలన్స్ లో ఒకడు. పవన్ తో నటించడం తన డ్రీమ్ అని చెప్పిన కబీర్ కి.. ఈ ఆఫర్ త్వరగానే వచ్చేసింది. అయితే.. జిల్ తర్వాత ఇప్పటివరకూ తెలుగులో సరైన సినిమా పడలేదు ఈ విలన్ కి. కిక్2 - కృష్ణాష్టమి - డిక్టేటర్ - గరం - తుంటరి చిత్రాలు గుర్తింపును తెచ్చిపెట్టలేకపోయాయి.

దీంతో తన ఆశలన్నీ పవర్ స్టార్ పైనే పెట్టేసుకున్నాడు కబీర్. తనకు విలన్ గా స్టార్ స్టేటస్ ని పవన్ అందిస్తాడని కబీర్ దుహాన్ సింగ్ నమ్మకంగా ఉన్నాడు. మరి ఈ విలన్ ఆశలను.. పవర్ స్టార్ ఏ మేరకు నెరవేరుస్తాడో తెలియాలంటే.. ఉగాది వరకూ ఆగాల్సిందే.

,  ,  ,  ,  ,