Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

02-Sep-2016 11:50:54
facebook Twitter Googleplus
Photo

సరైనోడు చిత్రంతో ఈ సంవత్సరం అతి పెద్ద హిట్ ను అందుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా హరీష్ శంకర్ దర్శకత్వంలో డీజే ? దువ్వాడ జగన్నాథం అనే కొత్త సినిమాను ప్రారంభించాడు. ఇటీవలే ప్రారంభోత్సవ కార్యక్రమాలు జరుపుకున్న ఈ చిత్రం త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లనుంది. ఇకపోతే ఈ చిత్రంలో బన్నీ సరసన హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ ను ఫైనల్ చేశారు.
గతంలో బన్నీతో కలిసి ?ఆర్య-2, ఎవడు? వంటి చిత్రాల్లో నటించిన కాజల్ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ?ఖైధీ నెం.150? లో కూడా నటిస్తోంది. ఇకపోతే ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం కంప్లీట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఉండనుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్న ఈ చిత్రానికి బాలీవుడ్ సినిమాటోగ్రఫర్ ఆయాంకా బోస్ పనిచేయన్నారు. ఈ చిత్రాన్ని 2017 సమ్మర్ కానుకగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

,  ,  ,  ,  ,  ,  ,  ,