Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

22-Apr-2016 19:11:01
facebook Twitter Googleplus
Photo

ఈ ఏడాది సంక్రాంతికి పెద్దగా అంచనాల్లేకుండా విడుదలై.. సంచలన విజయం సాధించింది ?సోగ్గాడే చిన్నినాయనా?. సినిమా విడుదలకు ముందు దీని దర్శకుడు కళ్యాణ్ కృష్ణ మీద కూడా ఎవరికీ అంచనాల్లేవు. ?సోగ్గాడే..?కు రీషూట్లు జరిగాయని.. నాగ్ నమ్మకాన్ని కళ్యాణ్ నిలబెట్టుకోలేకపోయాడని.. రకరకాల ప్రచారాలు కూడా జరిగాయి. కానీ సినిమా విడుదలయ్యాక ఆ ప్రచారాలన్నీ ఎగిరిపోయాయి. కళ్యాణ్ సత్తా ఏంటో సినిమా చూశాక కానీ అందరికీ అర్థం కాలేదు. నాగ్ లాంటి సీనియర్ నటుడిని సరిగ్గా వాడుకుని.. ఓ మామూలు కథతోనే మంచి ఎంటర్టైనర్ తీసి ప్రేక్షకుల మెప్పు పొందాడు కళ్యాణ్. అతడి టాలెంటు చూసి రెండో సినిమా సైతం తన బేనర్లోనే చేసే అవకాశం కల్పించాడు నాగ్.

నాగ్ పెద్ద కొడుకు నాగచైతన్యతో కళ్యాణ్ రెండో సినిమా కమిటైన సంగతి తెలిసిందే. ఈ సినిమా శుక్రవారమే పెద్దగా హడావుడి లేకుండా ప్రారంభోత్సవం జరుపుకుంది. అన్నపూర్ణ స్టూడియోలో సింపుల్ గా ప్రారంభోత్సవం కానిచ్చేశాడు నాగ్. ఈ చిత్రాన్ని నాగార్జునే స్వయంగా నిర్మిస్తున్నాడు కూడా. ప్రారంభోత్సవం కూడా ఆయన చేతుల మీదుగానే జరిగింది. హీరో నాగచైతన్య మాత్రం ఈ కార్యక్రమంలో పాల్గొనలేదు. చెన్నైలో ?సాహసం శ్వాసగా సాగిపో? షూటింగ్ లో పాల్గొంటుండటం వల్ల చైతూ రాలేకపోయాడు. ఈ సినిమా కోసం క్లైమాక్స్ మాత్రమే చిత్రీకరించాల్సి ఉంది. ఈ షెడ్యూల్ తో ఆ సినిమా పూర్తయిపోతుంది. మరోవైపు చైతూ ?ప్రేమమ్? రీమేక్ లోనూ నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాలపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

,  ,  ,  ,  ,  ,