చాలా రోజుల నుండి హిట్టు కోసం ఎదురు చస్తున్నాడు దర్శకుడు పూరి జగన్. ఇప్పుడు కనుక మనోడికి మీడియా సరైన హెల్ప్ చేసిందంటే మాత్రం.. ఒక పెద్ద హిట్టు కొట్టేస్తాడు. మరి మీడియా అందుకు సాయపడుతుందా? ఇంతకీ మీడియా సాయం ఏంటనేగా మీ సందేహం? ఛలో చూసేద్దాం.
నిజానికి తన సినిమాల్లో హీరోల తాలూకు క్యారెక్టరైజేషన్ అండ్ బాడీ లాంగ్వేజ్ చాలా పవర్ ఫుల్ గా ఉండేలా చూసుకుంటాడు మన పూరి. తన హీరోలందరూ పంచులు పేలుస్తూ.. జీవితపు పేజీలను బాగా చదివేసిన వారిలా డైలాగులు దంచేస్తూ ఉంటారు. ఇక ఆ బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్లే వాళ్ళకి మాంచి ప్రొఫెషన్ ఒకటి అంటగడతాడులే మనోడు. వచ్చే నెల నుండి కళ్యాణ్ రామ్ తో మొదలవుతున్న సినిమాలో.. కళ్యాణ్ రామ్ ఒక జర్నలిస్టు పాత్రను ప్లే చేస్తున్నాడట. అదిగో అది అసలు సంగతి.
మామూలుగా చాలా సినిమాల్లో మీడియాను కబడ్డీ ఆడుకున్న పూరి.. కెమెరామ్యాన్ గంగతో రాంబాబు సినిమాలో మాత్రం.. మీడియా పక్షాన ఏదో ప్రయత్నిస్తే అది తుస్సుమంది. అందుకే ఇప్పుడు మళ్ళీ జర్నలిస్టు అదీ అంటున్నాడు కాబట్టి.. మీడియా ఎంతవరకు సాయపడుతుంది అని అందరూ అడుగుతున్నారు. లెటజ్ సీ!!