Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

24-Nov-2017 10:09:04
facebook Twitter Googleplus
Photo

యువ హీరోల్లో ప్రస్తుతం జూనియర్ ఎన్టిఆర్ తన సినిమాలతో బాక్స్ ఆఫీస్ హిట్స్ అందుకుంటున్నాడు. మొత్తంగా నందమూరి ఫ్యామిలీ లో ఇప్పుడు అత్యధిక మార్కెట్ ఉన్న హీరో ఎన్టీఆర్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే అతని సోదరుడు కళ్యాణ్ రామ్ కూడా తనదైన శైలిలో సినిమాలని చేస్తూ అలరిస్తున్నాడు. కొత్తగా ఏదో ఒకటి అందివ్వాలనే ప్రయత్నం చేస్తూనే ఉంటాడు.

కళ్యాణ్ రామ్ ప్రస్తుతం ఉపేంద్ర మాదవ్ దర్శకత్వంలో ఎమ్మెల్యే సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా ఇప్పటికే చాలా వరకు పూర్తయ్యింది. ఫైనల్ షెడ్యూల్ ఒక్కటి అయిపోతే దాదాపు సినిమా అయిపోయినట్లే. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తి చేసి వీలైనంత త్వరగా సినిమాని ఫినిష్ చేయాలని చూస్తున్నాడు. ఆ సినిమా తర్వాత యాడ్ ఫిలిం మేకర్ జయేంద్ర దర్శకత్వంలో ఒక సినిమాను చేయబోతున్నాడు. పిసి శ్రీరామ్ కెమెరామెన్ గా సెలెక్ట్ అయిన ఆ సినిమాలో తమన్నా హీరోయిన్ గా చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇక అసలు విషయానికి వస్తే ఇంకా ఈ సినిమా పూర్తిగా మొదలు కాలేదు కానీ అపుడే శాటిలైట్ బిజినెస్ ని బాగా చేసేసింది. జెమినీ టివి వారు ఈ కొత్త ప్రాజెక్ట్ ని రూ.4.75 కోట్లకు కొనుగోలు చేశారని తెలుస్తోంది. కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే ఇది చాలా పెద్ద రికార్డ్ అని చెప్పాలి. అతని సినిమాలు ఏవి ఇంతవరకు ఈ స్థాయిలో అమ్ముడు పోలేదు. అయితే విడుదలకు.ముందే కథ శాటిలైట్ హక్కులు అంతగా అమ్ముడు పోయాయి. దీంతో సినిమా ఏ స్థాయిలో ఉంటుందో అనే అంచనాలు రేగుతున్నాయి.

,  ,  ,  ,  ,