Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

16-Feb-2015 11:40:02
facebook Twitter Googleplus
Photo

కమలహాసన్ నటించిన 'ఉత్తమ విలన్' చిత్రం ఆడియో వేడుకను వెరైటీగా ప్లాన్ చేస్తున్నారు. టైటిల్ కి తగ్గట్టుగా దక్షిణాది సినిమా రంగానికి చెందిన ఉత్తమ విలన్లను ఎంపిక చేసి, ఆ వేడుకలో సన్మానించడానికి నిర్ణయించారు. దక్షిణాది నాలుగు భాషలకు చెందిన ప్రముఖ విలన్ పాత్రధారులను ఆ రోజు కమల్ ఘనంగా సత్కరిస్తారు. ఈ ఆడియో విడుదల కార్యక్రమం మార్చి ఒకటిన చెన్నయ్ లో గ్రాండుగా ఏర్పాటు చేస్తున్నారు. ప్రముఖ నటుడు రమేష్ అరవింద్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో కమల్ రెండు డిఫరెంట్ పాత్రలను పోషించాడు. ఏప్రిల్ 2న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఎరోస్ ఇంటర్నేషనల్ సంస్థ ఈ 'ఉత్తమ విలన్' చిత్రం ప్రదర్శన హక్కులను తీసుకుంది.

,  ,  ,  ,  ,