Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

30-Aug-2016 11:44:37
facebook Twitter Googleplus
Photo

లోకనాయకుడు కమల్‌హాసన్‌ మళ్ళీ యాక్షన్ లోకి దిగారు. కొన్ని రోజుల క్రితం కమల్ ఇంటి మెట్లపై జారిపడటంతో కాలి ఎముక విరిగిన విషయం తెలిసిందే. దీంతో ఆయనకు ఆపరేషన్ జరిగింది. సుమారు 25 రోజుల పాటు ఆస్పత్రిలోనే చికిత్స పొందారు. కొన్నిరోజుల క్రితమే డిశ్చార్జి అయ్యారు.

ఇప్పుడు పూర్తిగా కోలుకున్న కమల్ తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ?శభాష్‌ నాయుడు?పనులను మళ్ళీ మొదలుపెట్టారు. ?మళ్లీ పరిగెత్తడానికి సిద్ధంగా వున్నా? అంటూ ట్వీట్ చేశారాయన. ఈ సందర్భంగా వైద్యులు, ఫిజియోథెరపిస్టులకు కృతజ్ఞతలు చెప్పారు.

ఈ చిత్రంలో కమల్ కు జోడిగా రమ్యకృష్ణ నటిస్తుండగా, ఆయన కూతురి పాత్రను శ్రుతి హసన్ పోషిస్తోంది. బ్రహ్మానందం ఇందులో మరో కీలక పాత్రలో కనిపించనున్నాడు.చిత్రానికి మ్యాస్ట్రో ఇళయరాజా మ్యూజిక్ అందిస్తున్నారు

,  ,  ,  ,  ,