Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

06-Oct-2015 15:29:38
facebook Twitter Googleplus
Photo

ఇది ఒక మంచి పాటల ఆల్బమ్ అని ఎలా చెప్పొచ్చు? శ్రోతలు ఆ పాటల్ని పదే పదే హమ్మింగ్ చేసినప్పుడు. బాత్ రూమ్ సింగర్ లు ఎగ్జయిట్ మెంట్ లో బైటికే వినిపించేలా పాడుకున్నప్పుడు. మరో యాంగిల్ లో చూస్తే ఎఫ్.ఎం రేడియోలు రిగరస్ గా ప్రమోట్ చేసినప్పుడు.. రిపీటెడ్ గా ఆ పాటని వినిపించినప్పుడు.. ఆ పాటల్లో విషయం ఉంది అని కన్ఫమ్ చేసుకోగలం. ముఖ్యంగా మాస్ బీట్ తో హుషారుగా సాగే పాటలకే ఇలాంటి పాలోయింగ్ ఉంటుంది. ఏదో కథలో భాగంగా నేరేషన్ లో భాగంగా మెలోడియస్ గా ఉన్నా అందులో సాహిత్యం పరంగా కానీ సంగీతం పరంగా కానీ హుషారు లేకపోతే వాటిని ఎవరూ పట్టించుకోరు.

ప్రస్తుతం కంచె పాటల విషయంలో అదే జరుగుతోంది. ఓ రేడియో అఫీషియల్ ఇచ్చిన ఇన్ ఫర్మేషన్ ప్రకారం.. కంచె పాటల్ని రేడియోల్లో ప్రమోట్ చేయడానికి ఒకే ఒక్క కారణం దర్శకుడు క్రిష్ పై ఉన్న గౌరవమే తప్ప.. ఆ పాటల్లో మాస్ అప్పీల్ ఏం లేదు. పదే పదే హమ్ చేసేంత విషయం లేదు. కేవలం కథలో భాగంగా కథని డ్రైవ్ చేసే విధంగా మాత్రమే పాటలు ఉన్నాయి. చిరంతన్ భట్ మ్యూజిక్ లో చెప్పుకోదగ్గ హుషారు లేదని చెబుతున్నారు. పైగా కంచె రిలీజ్ డేట్ వాయిదా వేయడంతో ఇప్పుడు అసలు ఎఫ్.ఎం.లు కంచె ఆడియోని పట్టించుకోవడం లేదు. తిరిగి రిపీటెడ్ గా వేయడం లేదు.

ప్రెజెంట్ ట్రెండ్ లో ఏ పాటల్లో ఎక్కువ కిక్కుందో ఆ పాటల్నే రిపీటెడ్ గా వినిపిస్తున్నారు. రిలీజ్ విషయంలో సరిగా ప్లాన్ లేకపోతే ఉచిత ప్రచారాన్ని కోల్పోయినట్టే. కంచె నవంబర్ కి వాయిదా పడడంతో ఈ గ్యాప్ లో ఆ సినిమాకి కావాల్సిన ప్రమోషన్ దొరకలేదనే చెప్పాలి. ఏదో టీవీ చానెళ్లు అంటే నిర్మాతలు డబ్బులిస్తారు కాబట్టి టీజర్ లను వేస్తే వేయొచ్చు.. కానీ డబ్బు ఎదురిచ్చి ఆడియోని కొనుక్కుని శ్రోతలకు వినిపించే ఎఫ్.ఎం.లు మాత్రం అంతగా క్లిక్కవ్వని పాటల్ని ఎలా వినిపిస్తాయ్? దట్స్ ట్రూ!!

,  ,  ,