Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

22-Apr-2017 10:58:11
facebook Twitter Googleplus
Photo

దేశం మొత్తాన్ని ఒక ప్రశ్న వేధించడం మొదలు పెట్టింది.. 2015 నుండి అదే.. బహుబలిని కట్టప్పా ఎందుకు చంపాడు? దీని లో చాలా మంది తెలుసుకోవాలి అని అడిగిన వాళ్ళు కన్నా.. అర్ధంకాక అడిగినా వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళందరి కోసం వస్తుంది బాహుబలి 2 ఈ నెల ఏప్రిల్ 28న.

ఈ ప్రశ్న పైన జోక్ చేసిన వాళ్ళు ఉన్నారు. అది కూడా ఒక సార్కాస్టిక్ దోరణితో.. కాని వాళ్ళ మాట నెగ్గ లేదు. ఎందుకంటే మరి బాహుబలి ప్రభంజనం అటువంటిది. కానీ ఇప్పుడు ఆ నిజం తెలుసుకోవడానికి సమయం వచ్చింది. అయితే మొట్టమొదటిసారిగా ఆ సమాదానం మాత్రం హిందీ వారికే తెలుస్తుంది. ఈ సినిమాని హింది లో కరణ్ జోహర్ డిస్ట్రిబూట్ చేస్తున్నాడు కదా.. కాబట్టి బాహుబలి మొత్తం టీమ్ తో పాటుగా.. ఆ సినిమా క్రూ అండ్ కాస్ట్ తో హింది వర్షన్ బాహుబలి 2 స్పెషల్ స్క్రీనింగ్ ఏప్రియల్ 27 రాత్రినే వేస్తారట. కరణ్ జోహర్ మంచి ఫిల్మ్ మేకేరే కాదు పార్టీ బోయ్ కూడా మరి ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన బహుబలికి పార్టీ ఇవ్వకుండా ఉంటాడా.అందుకే అక్కడ స్పెషల్ స్క్రీనింగ్. అందుకే ఫస్టు బాలీవుడ్ లో వేయిస్తున్నాడు.

సో.. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో.. ముందుగా హిందీ వారికే తెలుస్తుందనమాట.

,  ,  ,  ,  ,