Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

22-Sep-2016 13:14:17
facebook Twitter Googleplus
Photo

తమిళ హీరో కార్తి కాష్మోరా అనే సినిమా చేస్తున్నాడంటే అక్కడి జనాలు కూడా పెద్దగా పట్టించుకోలేదు. ఇదేదో మామూలు హార్రర్ సినిమానేలే అనుకున్నారు. కానీ ?కాష్మోరా? ఫస్ట్ లుక్ పోస్టర్ చూశాక అందరికీ దిమ్మదిరిగింది. ఆ పోస్టర్.. అందులోని ఇంటెన్సిటీ.. కార్తి అవతారం చూసి చాలామందికి నోట మాట రాలేదు. ఇక ఈ సినిమా బడ్జెట్ రూ.60 కోట్లని తెలిశాక మరింతగా చర్చ జరిగింది. ఈ సినిమాలో చాలా ప్రత్యేకతలున్నాయని అర్థమైంది. ఇక ఈ సినిమా టీజర్ ఎప్పుడొస్తుంది.. ట్రైలర్ ఎప్పుడొస్తుంది థియేటర్లలోకి ఎప్పుడొస్తుంది అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రైలర్.. ఆడియో రిలీజ్ డేట్ ప్రకటిస్తూ ఒక కొత్త పోస్టర్ వదిలింది పీవీపీ సినిమా.

ఈ కొత్త పోస్టర్లోనూ కార్తి లుక్ అదిరిపోయింది. పాత అవతారమే కానీ.. ఈ లుక్ లో మరింత ఇంటెన్సిటీ కనిపిస్తోంది. సినిమా మీద అంచనాల్ని మరింత పెంచేలా ఉంది ఈ కొత్త లుక్. ఇంతకుముందు తెలుగులోకి డబ్ అయిన జీవా ?రౌద్రం? సినిమాతో దర్శకుడిగా పరిచయమైన గోకుల్ అనే దర్శకుడు రూపొందిస్తున్న సినిమా ఇది. ఆ తర్వాత విజయ్ సేతుపతి హీరోగా ఓ కామెడీ సినిమా తీసి హిట్టు కొట్టాడు గోకుల్. ఇప్పడు కాష్మోరాను హార్రర్-థ్రిల్లర్-కామెడీ మిక్స్ చేసి తీశాడు. ?యుగానికి ఒక్కడు? తర్వాత తన కెరీర్లో అత్యంత క్లిష్టమైన సినిమా ఇదేనని.. దీని కోసం నెలల తరబడి విపరీతంగా శ్రమించానని కార్తి చెప్పాడు. ఈ సినిమా కోసం అతను గుండు కొట్టించుకోవడంతో పాటు అనేక అవతారాలు కూడా మార్చాడు. అక్టోబరు 28న దీపావళి కానుకగా ?కాష్మోరా? ప్రేక్షకుల ముందుకొస్తుంది.

,  ,  ,  ,  ,