ఏ ముహూర్తాన కాటమరాయుడు సినిమాకు ముహూర్తం కుదిరిందో కానీ.. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటిదాకా ఏ విశేషం కూడా పాజిటివ్ ఫీలింగ్ ఇవ్వలేదు. ఎస్.జె.సూర్య దర్శకత్వంలో ఈ సినిమా అన్నపుడే అభిమానుల్లో అంత ఆసక్తి కలగలేదు. డాలీ వచ్చాక కూడా ఫీలింగ్ ఏమీ మారలేదు. ఇక హడావుడిగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కానీ.. ఆ తర్వాత వచ్చిన దీపావళి పోస్టర్ కానీ ఏమంత కిక్కివ్వలేదు. తాజాగా హ్యాపీ న్యూ ఇయర్ శుభాకాంక్షలతో రిలీజ్ చేస్తున్న వరుస పోస్టర్లకు నెగెటివ్ ఫీడ్ బ్యాకే వస్తోంది. పవన్ కాళ్లు చెప్పులు చూపిస్తూ రిలీజ్ చేసిన పోస్టర్లపై సోషల్ మీడియాలో చాలా సెటైర్లు పడ్డాయి. చివరగా రిలీజ్ చేసిన బ్యాక్ లుక్ ?రౌడీ? సినిమాలో మోహన్ బాబు పోస్టర్ని గుర్తుకు తెస్తోందంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో డిసెంబరు 31 అర్ధరాత్రి రిలీజవుతుందని చెబుతున్న టీజర్ ఎలా ఉంటుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు. టీజర్ అయినా ఏమైనా కొత్తగా ఉంటుందేమో.. మంచి ఫీడ్ బ్యాక్ తెచ్చుకుంటుందేమో అన్నది అభిమానుల ఆకాంక్ష. ?కాటమరాయుడు? తమిళ హిట్ మూవీ ?వీరం?కు రీమేక్ అన్న ప్రచారం మొదట్నుంచి ఉంది. ఐతే ఆ చిత్ర యూనిట్ మాత్రం అది నిజం కాదంటోంది. బహుశా దీన్ని ?అడాప్షన్? అని భావిస్తున్నారేమో. ఐతే ఇప్పటిదాకా బయటికి వచ్చిన విశేషాలు చూస్తుంటే.. ?వీరం? ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి టీజర్ చూస్తే ఈ సినిమా ?వీరం?కు రీమేకా.. అడాప్షనా అన్నది తేలిపోతుంది. ఐతే కాన్సెప్ట్ సంగతి ఎలా ఉన్నా.. టీజర్ తో ప్రేక్షకులకు మంచి అనుభూతిని పంచాల్సిన అవసరమైతే ఉంది.