Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-Jul-2015 14:37:47
facebook Twitter Googleplus
Photo

రజనీకాంత్ తో సినిమా అంటే ఓ 'రేంజి'లో వుంటుంది. అందులోనూ దానికి శంకర్ లాంటి భారీ చిత్రాల దర్శకుడు సారథి అయితే ఇక చెప్పేదేముంది? మరింత భారీతనం సంతరించుకుంటుంది. ఇప్పుడు ఓ సినిమా విషయంలో అలాగే జరుగుతోంది. శంకర్ రూపొందించనున్న 'రోబో 2' సినిమాలో రజనీకాంత్ హీరోగా, విక్రం విలన్ గా నటించనున్న సంగతి తెలిసిందే. ఇందులో రజనీ సరసన నటించడానికి ఓ పెద్ద బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కోసం అన్వేషించి చివరికి కత్రినా కైఫ్ ని ఎంచుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం శంకర్ ఆమెతో ఈ విషయమై సంప్రదింపులు జరుపుతున్నట్టు చెబుతున్నారు. రజనీతో గతంలో ఓసారి ఛాన్స్ మిస్సయిన కత్రినా ఈసారి వదులుకోకుండా, డేట్స్ సద్దుబాటు చేస్తోందట. సో, ఆమె కనుక నటిస్తే సినిమా రేంజ్ ఇంకా పెరగడం ఖాయమే!

,