Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

09-Jan-2017 11:59:41
facebook Twitter Googleplus
Photo

ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి ఒక సినిమా ప్రత్యేక ప్రదర్శనకు హాజరైన సందర్భాలు గతంలో ఎన్నడూ లేకపోవచ్చు. ఇప్పుడు ఈ అరుదైన దృశ్యం చూడబోతున్నాం. నందమూరి బాలకృష్ణ కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ?గౌతమీపుత్ర శాతకర్ణి? స్పెషల్ ప్రివ్యూ షోకు రెడు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు బాలయ్య సినిమా చూడటంలో ప్రత్యేకత ఏమీ లేదు కానీ.. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఈ షోకు హాజరు కానుండటం విశేషం. బాలయ్య మొన్నే మర్యాదపూర్వకంగా కేసీఆర్ ను కలిసి తన సినిమా ప్రదర్శనకు ఆహ్వానించిన సంగతి తెలిసిందే.

బాలయ్య ఆహ్వానాన్ని లైట్ తీసుకోకుండా నిజంగానే కేసీఆర్ తన కుటుంబంతో కలిసి ఈ సినిమా చూడబోతున్నట్లు సమాచారం. ఇందుకు తగ్గట్లు షెడ్యూల్ ప్లాన్ చేయాలని కూడా అధికారులకు చెప్పారట. మరోవైపు కేసీఆర్ తనయుడు కేటీఆర్.. తనయురాలు కవిత కూడా ఈ షోకు హాజరవుతారట. చంద్రబాబు తన సతీమణి భువనేశ్వరి.. కొడుకు లోకేష్.. కోడలు బ్రహ్మణి.. మనవడు దేవాన్ష్ లతో కలిసి ఈ షోకు వస్తారని సమాచారం. మొత్తానికి ఓ సినిమా ప్రదర్శనకు చంద్రబాబు.. కేసీఆర్ తమ కుటుంబాలతో కలిసి హాజరవడం విశేషమే. బాలయ్య మామూలు సినిమా చేసి ఉంటే లైట్ తీసుకునేవాళ్లేమో కానీ.. శాతకర్ణి లాంటి గొప్ప చక్రవర్తి కథతో సినిమా చేయడంతో ఈ షోకు రావడం సముచితంగానే అనిపించుకుంటుంది. ఇంకా సినీ.. రాజకీయ రంగాలకు చెందిన అతిరథ మహారథులు ఈ షోకు హాజరవుతారని.. ఆ రోజు హంగామా మామూలుగా ఉండదని తెలుస్తోంది.

,  ,  ,  ,  ,  ,  ,