Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

08-Nov-2017 11:29:31
facebook Twitter Googleplus
Photo

కన్నడ స్టార్ హీరో సుదీప్ ను అంత తేలిగ్గా మరిచిపోరు. ఆ సినిమాకు గ్రాఫిక్స్ ఎంత కీలకమో నటనపరంగా సుదీప్ అంతకన్నా ఎంతో కీలకం. లేని ఈగను ఊహించుకుంటూ విలన్ గా అతడు చూపించిన నటన అమోఘమనే చెప్పాలి. ఈగకన్నా ముందు రక్తచరిత్రలోనూ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించాడు. తాజాగా కిచ్చా సుదీప్ హాలీవుడ్ లో రంగప్రవేశం చేయనున్నాడు.

ఆస్ట్రేలియన్ దర్శకుడు ఎడ్డీ ఆర్య డైరెక్షన్ లో రైజెన్ పేరుతో తెరకెక్కుతున్న ఇంగ్లీష్ మూవీలో సుదీప్ ముఖ్య పాత్ర చేయబోతున్నాడు. సైంటిఫిక్ ఫిక్షన్ థ్రిల్లగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ బయటకు వచ్చింది. దీనిని కిచ్చా అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. ఈ సినిమాలో సుదీప్ న్యూయార్క్ లో స్థిరపడిన ఆర్మీ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. అమెరికన్ హీరోయిన్ నికొలే స్కాల్మొ ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది.

సుదీప్ కు కన్నడం లో బ్రహ్మాండమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈగ తరవాత అతడికి టాలీవుడ్ - బాలీవుడ్ లోనూ గుర్తింపు లభించింది. ఇప్పుడు హాలీవుడ్ లో నటిస్తుండటంతో అతడి అభిమానులు పండగ చేసుకునంటున్నారు.

,  ,  ,  ,  ,