Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-Jun-2015 17:42:29
facebook Twitter Googleplus
Photo

రాంగోపాల్ వర్మ తాజా చిత్రం 'కిల్లింగ్ వీరప్పన్' షూటింగ్ ఈ రోజున మొదలైంది .. తాజాగా విడుదలైన పోస్టర్లు ఈ విషయాన్ని చెబుతున్నాయి. కర్ణాటక .. తమిళనాడు ప్రాంతాల్లోని అడవుల్లో వీరప్పన్ స్థావరాలను ఏర్పాటు చేసుకున్న ప్రదేశాల్లో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. కొన్ని సన్నివేశాలను మారేడుమిల్లి ఫారెస్ట్ లోను చిత్రీకరిస్తారు. గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ ని వేటాడి పట్టుకోవడమే ఈ సినిమాలోని కథావస్తువు.


ఈ ఆపరేషన్ కొనసాగించే ప్రధాన పోలీస్ అధికారిగా కన్నడ హీరో శివరాజ్ కుమార్ నటిస్తున్నాడు. అడవి నేపథ్యంగా సాగే కథా వస్తువును ఆసక్తికరంగా తెరకెక్కించడంలో వర్మ సిద్ధహస్తుడు. అలాగే యథార్థ సంఘటనలకి దృశ్యరూపాన్ని ఇవ్వడంలో ఆయనకంటూ ఓ స్టైల్ వుంది. మరి అడవి నేపథ్యంగా జరిగిన ఈ వాస్తవ సంఘటన, ఆయన ఆశించిన సక్సెస్ ని ఇస్తుందో .. లేదో చూడాలి.

,  ,