Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

24-May-2016 11:54:55
facebook Twitter Googleplus
Photo

నాకు నేనే పోటీ... నాతో నాకే పోటీ అంటున్నాడు సంపూ. హృదయకాలేయంతో ఆన్ లైన్ లో తాను కొట్టిన రికార్డులన్నింటినీ ఇప్పుడు `కొబ్బరి మట్ట`తో బద్ధలు కొడుతున్నాడు. వరల్డ్ లార్జెస్ట్ టీజర్ అంటూ నిన్ననే కొబ్బరిమట్ట టీజర్ విడుదల చేశారు. అది మూడు నిమిషాల నిడివితో సాగుతుంది. ట్రైలర్లనే మించిపోయిన టీజర్ అన్నమాట.

ఆ టీజర్ లో విశేషమేంటంటే రెండు నిమిషాలకి పైగా సాగే డైలాగుని సంపూ గుక్క తిప్పుకోకుండా చెప్పాడు. ఆడవాళ్ల గొప్పదనం గురించి పెదరాయుడు గెటప్ లో ఆ డైలాగ్ చెప్పాడు సంపూ. టీజర్ విడుదలవ్వగానే సంపూ డైలాగులతో ఆన్ లైన్ హోరెత్తిపోయింది. సంపూ సూపర్ అంటూ ఆయన అభిమానులు కితాబునిచ్చారు. మరో కళాఖండంతో వస్తున్నాం అంటూ ఆయన చేస్తున్న ఈ సినిమా ఎన్నెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. టీజర్ విడుదలైన తొలి 9 గంటల్లోపే లక్షకిపైగా వ్యూస్ వచ్చాయనీ దీంతో హృదయకాలేయంతో నేను రాసిన రికార్డులన్నీ బద్దలయ్యాయయనీ సంపూ ట్విట్టర్ లో పేర్కొన్నాడు.

సంపూ టీజర్ ని చూసి సెలెబ్రిటీలు సైతం స్పందిస్తున్నారు. సంపూ ఇరగదీశాడంటూ మెచ్చుకొంటున్నారు. ఆన్ లైన్ లోనే కాపు కాసిన సంపూ తనని పొగిడినవాళ్లందరికీ సదా మీ ప్రేమకి బానిసని అంటూ కృతజ్ఞతలు చెబుతున్నాడు. ఈ సినిమాలో సంపూ మూడు పాత్రల్లో కనిపించబోతున్నాడు. ఆండ్రాయుడు - పెదరాయుడు - పాపారాయుడు పాత్రలు చేస్తున్నాడు. హృదయకాలేయం టీమ్ నుంచే వస్తున్న ఈ చిత్రంపై భారీగా అంచనాలున్నాయి. మరి ఆ అంచనాల్ని సంపూ అందుకొంటాడో లేదో చూడాలి.

,  ,  ,  ,  ,  ,