Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

16-Dec-2014 11:10:57
facebook Twitter Googleplus
Photo

'కార్తికేయ' సినిమా విజయంతో మంచి డిమాండులోకి వచ్చిన యంగ్ హీరో నిఖిల్ కొత్త సినిమాల విషయంలో కంగారుపడడం లేదు. అందుకే, వచ్చిన ప్రతి ఆఫర్నీ ఒప్పేసుకోవడం లేదట. ప్రస్తుతం 'సూర్య వెర్సస్ సూర్య' అనే సినిమాలో నటిస్తున్నాడు. దీనికి కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నాడు. ఇదిలా ఉంచితే, నిఖిల్ ని దృష్టిలో పెట్టుకుని ప్రముఖ రచయిత కోన వెంకట్ ఓ కథ తయారుచేశాడట. త్వరలో ఈ హీరోని కలసి వెంకట్ కథ చెబుతాడట. దీనిని బట్టి చూస్తే, నిఖిల్ కి ఇప్పుడు మంచి కథలు పడుతున్నాయనే చెప్పచ్చు!

,  ,  ,  ,  ,