Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

10-Jun-2016 15:21:21
facebook Twitter Googleplus
Photo

నిజానికి క్రిమినల్స్ కారణంగా ఈ సొసైటీ అనాగరికంగా తయారవ్వడం లేకపోతే వెనక్కి వెళ్ళకపోవడం జరగదు. కాని మంచివారు ఏమీ చేయకపోతే మాత్రం ఈ సమాజం కచ్చితంగా వెనక్కి వెళ్ళిపోతుంది. పాడవుతుంది. అన్నారు వివేకానందుల వారు. బాలయ్య ఒక మంచి మనిషి. యోగ్యుడు. అందుకే ఈరోజు మనం ఆయన జన్మదిన వేడుకలు ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటుంటే.. ఆయన అమెరికాలో నిధులు వసూలు చేస్తున్నారు'' అంటూ సెలవిచ్చాడు దర్శకుడు క్రిష్. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ లో ఈరోజు జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇలా చెప్పుకొచ్చాడు.

బాలయ్య బాబుకి 57 ఏళ్లా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసిన క్రిష్.. బాలయ్యలో ఇంకా ఒక చిన్న పిల్లవాడిని చూస్తున్నానని చెప్పడం విశేషం. ''మా సెట్ లో అందరికంటే చిన్నపిల్లాడు బాలయ్య బాబే. 99 సినిమాలు చేసిన ఒక లెజండరీ యాక్టర్ ఒక దర్శకుడుకు ఇచ్చే గౌరవం చూస్తే నాకే ఆశ్చర్యమేసింది. అంతే కాదు.. ఆయన సెట్లో ఉండే మాకు పండగే. పైగా ఎప్పుడూ నిత్య విద్యార్ధిలా ఉంటూనే.. మాకు కావల్సినప్పుడు ఆదర్శవంతమైన గైడెన్స్ అందిస్తున్నారు బాలయ్య'' అన్నాడు క్రిష్.

ప్రస్తుతం ఈ దర్శకుడు బాలయ్యతో ''గౌతమిపుత్ర శాతకర్ణి'' సినిమాను రూపొందిస్తున్నాడు.

,  ,  ,  ,  ,  ,