Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

12-Apr-2017 14:06:25
facebook Twitter Googleplus
Photo

కోలీవుడ్ సీనియర్ నటి ఖుష్బూ.. తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ తెలుగు సినిమా షూటింగ్ కు వచ్చేసింది. తమిళ ప్రేక్షకులతో అప్పట్లో గుడి కట్టించుకుని మరీ పూజలు అందుకున్న ఈమె.. ప్రస్తుతం సీనియర్ అయిపోవడంతో అప్పుడప్పుడు ప్రాధాన్యత ఉన్న పాత్రలు కల సినిమాల్లో మాత్రమే కనిపిస్తోంది.

పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతున్న మూవీలో కీలక పాత్ర పోషిస్తున్న ఖుష్బూ.. షూటింగ్ లో జాయిన్ అయిపోయినట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. 'గుడ్ మాణింగ్ ఫ్రం హైద్రాబాద్. పవన్ కళ్యాణ్- త్రివిక్రమ్ ల సినిమా షూటింగ్ లో ఇవాల్టి నుంచి పాల్గొంటున్నా. మొదటి రోజు స్కూల్ కి వచ్చినట్లుంది. చాలా నేర్చుకోవడం.. నేర్చుకోకుండా ఉండడం చేయాలి. దాదాపు 9 ఏళ్ల తర్వాత మళ్లీ తెలుగు సినిమాలో నటిస్తున్నా. బ్యాక్ టు స్కూల్' అంటూ చెప్పుకొచ్చింది ఖుష్బూ.

2006లో రిలీజ్ అయిన మెగాస్టార్ మూవీలో స్టాలిన్ లో.. చిరుకు అక్కగా నటించిన ఖుష్బు.. ఆ తర్వాతి సంవత్సరంలో వచ్చిన యమదొంగ మూవీలో మోహన్ బాబుకు జోడీగా నటించింది. మళ్లీ ఇప్పుడే ఓ తెలుగు సినిమాలో నటించడం అన్న మాట.

,  ,  ,  ,  ,  ,  ,