Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

09-Sep-2015 17:44:37
facebook Twitter Googleplus
Photo

అందాల రాక్షసి సినిమా అప్పట్లో కమర్షియల్ గా పెద్ద సక్సెస్ కాకపోయినప్పటికీ.. అందులో భాగమైన అందరికీ మంచి పేరైతే తెచ్చిపెట్టింది. హీరో హీరోయిన్ల దగ్గర్నుంచి డైరెక్టర్ వరకు ఇప్పుడు మంచి మంచి అవకాశాలే పట్టారు. రాహుల్ హీరోగా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. నవీన్ చంద్ర మొదట్లో కొంచెం ఇబ్బంది పడ్డాడు కానీ.. ఇప్పుడతను కూడా కుదురుకున్నాడు. అటు తమిళంలో ఇటు తెలుగులో సినిమాలు చేస్తున్నాడు. డైరెక్టర్ హను రాఘవపూడికి వెంటనే అవకాశాలు తన్నుకు రాలేదు కానీ.. ఇప్పుడు 14 రీల్స్ కాంబినేషన్ లో నానితో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఐతే వీళ్లందరికంటే బాగా స్థిరపడింది మాత్రం లావణ్య త్రిపాఠీనే. దూసుకెళ్తా - మనం - తాజాగా భలే భలే మగాడివోయ్.. ఇలా వరుసగా ఆమె నటించిన ప్రతి సినిమా హిట్టే. అందులోనూ కొత్త సినిమా అయితే సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

లక్కీ గర్ల్ ట్యాగ్ వేసేసుకున్న లావణ్యను చూసుకుని ?లచ్చిందేవికి ఓ లెక్కుంది? టీమ్ ఇప్పుడు గాల్లో తేలిపోతోంది. లావణ్యతో పాటు ఇందులో నవీన్ చంద్ర ముఖ్య పాత్ర పోషిస్తుండటం విశేషం. ఇంతకుముందే ఈ సినిమాకు సంబంధించి కొన్ని లుక్స్ రిలీజ్ చేశారు కానీ.. అప్పుడు పెద్దగా రెస్పాన్స్ లేదు. ఐతే ?భలే భలే మగాడివోయ్? హిట్టు తర్వాత లావణ్య పేరు మార్మోగిపోతుండటంతో టైం చూసుకుని ప్రమోషన్ లోకి దిగుతున్నారు. ఈ రోజు రిలీజ్ చేసిన కొత్త లుక్ భలే ఇంట్రెస్టింగ్ గా ఉంది. నవీన్ తో లావణ్య ఆడేసుకుంటున్న తీరు ఫన్నీగా ఉంది. సాయిప్రసాద్ నిర్మించిన ఈ సినిమాతో జగదీష్ తలసిల దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి సంగీతాన్నందించడం విశేషం. అక్టోబరులో ఈ సినిమాను విడుదల చేయాలని చూస్తున్నారు.

,  ,  ,  ,