Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

11-Nov-2017 10:52:07
facebook Twitter Googleplus
Photo

బయోపిక్ అంటే.. ఒకటే ఉంటుంది. కానీ ఎన్టీఆర్ అంటేనే చరిత్ర. అందుకే ఆయన జీవితంపై ఒక సినిమా గురించిన ప్రకటన రాగానే.. టకటకా మరో 3 ప్రాజెక్టులకు సంబంధించిన అనౌన్స్ మెంట్స్ వచ్చేశాయి. తండ్రి జీవితంపై సినిమా తీస్తున్నట్లు బాలకృష్ణ చెప్పగానే.. రాంగోపాల్ వర్మ ఓ యాంగిల్ స్టోరీతో లక్ష్మీస్ ఎన్టీఆర్ ను.. కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి మరో యాంగిల్ లో లక్ష్మీస్ వీరగ్రంథం అంటూ మరో కథను రూపొందిస్తుండగా.. నిర్మాత రామసత్యనారాయణ కూడా ఎన్టీఆఱ్ బయోపిక్ తీస్తానని చెప్పారు.

ఇప్పుడు లక్ష్మీస్ వీరగ్రంథం సినిమాపై ఓ క్లారిటీ వచ్చేసింది. మూవీ ప్రారంభానికి ముహూర్తం కూడా ప్రకటించేశారు. నవంబర్ 12న ఉదయం 11.30-12.30 మధ్యలో ముహూర్తం నిర్ణయించినట్లుగా.. ఇన్విటేషన్ కార్డులు కూడా వేసేశారు. పైగా ఎన్టీఆర్ జీవితంలో ఓ కీలక ఘట్టంపై రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ గార్డెన్స్ లో.. ఎన్టీఆర్ సమాధి వద్దే ప్రారంభించనున్నట్లు చెప్పడం మరీ విశేషం. అందరూ ఆహ్వానితులే అంటూ వేసిన ఇన్విటేషన్ ఆకట్టుకుంటోంది.

ఈ సందర్భంగా ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఓ మహిళను నడుం నుంచి కిందవరకూ పియానో ముందు రిలాక్స్ అవుతూ ఉండడంతో పాటు.. వెనక ఎన్టీఆర్ ఫోటోను కూడా ఉంచడం విశేషం

,  ,  ,  ,  ,