Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

21-Jul-2016 14:29:01
facebook Twitter Googleplus
Photo

ప్రపంచవ్యాప్తంగా జూలై 22న రజనీకాంత్ ?కబాలి? చిత్రం 4000లకు పైగా థియేటర్లలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇండియాలో ఈ సినిమాకి ప్రీమియర్ షోలు లేనందున దేశవ్యాప్తంగా ఉన్న రజనీ అభిమానులు, సినీ ప్రియులు ఈ సినిమా టాక్ ఏమిటో తెలుసుకోవాలని చాలా ట్రై చేస్తున్నారు. అందుకే యూఎస్ లో సహా పలు చోట్ల ప్రత్యేకంగా సినిమా చూసిన వాళ్ళ అభిప్రాయాన్ని అభిమానుల ముందుంచుతున్నాము.
దర్శకుడు పా. రంజిత్ సినిమాలో రజనీకాంత్ ట్రేడ్ మార్క్ స్టైల్ ని, నటనని అద్భుతంగా ఆవిష్కరించడంలో పూర్తిగా సక్సెస్ అయ్యాడట. సినిమాలో ఆసక్తికరమైన థ్రిల్స్ తో పాటు రజనీ పాపులర్ డైలాగులు కొన్నింటిని కూడా చాలా బాగా వాడాడట దర్శకుడు. కానీ సినిమా చివర క్లైమాక్స్ చాలా సీరియస్ గా ఉండటం అభిమానులను కొంత నిరుత్సాహపరుస్తుంది కూడా తెలుస్తోంది. మరో వైపు ఈ టాక్ ఎలా ఉన్నా కూడా అభిమానులు మాత్రం తమ అభిమాన నటుడిని ఎప్పుడెప్పుడు స్క్రీన్ మీద చూస్తామా అని ఆతురతగా ఎదురు చూస్తున్నారు.

,  ,  ,  ,  ,  ,  ,