Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

11-May-2015 12:17:46
facebook Twitter Googleplus
Photo

నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా ఆమధ్య వచ్చిన 'పటాస్' హిట్ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేస్తున్నారు. ప్రముఖ నిర్మాత ఆర్బీ చౌదరి ఈ హక్కులను భారీ మొత్తం చెల్లించి సొంతం చేసుకున్నారు. ఈ రీమేక్ లో లారెన్స్ హీరోగా నటిస్తున్నాడు. ఈ విషయాన్ని తనే వెల్లడించాడు. "దర్శకుడిగా కొన్నాళ్ల పాటు విరామం తీసుకుంటున్నాను. ఈ బ్రేక్ సమయంలో ప్రస్తుతం 'పటాస్' తమిళ రీమేక్ లో హీరోగా నటిస్తున్నాను. ప్రస్తుతం ఈ ప్రాజక్టుకి సరైన దర్శకుడి కోసం చూస్తున్నాం" అని చెప్పాడు లారెన్స్. ఇదిలా ఉంచితే, లారెన్స్ ఇటీవల తాను హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన 'కాంచన 2' చిత్రం దక్షిణాదిలో సూపర్ హిట్టయింది.

,  ,  ,  ,  ,