Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

22-Feb-2016 12:16:53
facebook Twitter Googleplus
Photo

తెలుగు చిత్రసీమ మణిహారం.. గిన్నీస్‌బుక్ రికార్డ్ ెల్డర్ ప్రఖ్యాత నటి, దర్శక, నిర్మాత శ్రీమతి విజయనిర్మల గారి జన్మదిన వేడుకలు శనివారం నానక్‌రావ్‌ుగూడాలోని స్వగృహంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి పలువురు చిత్ర పరిశ్రమ ప్రముఖులతో పాటు పెద్ద ఎత్తున ఘట్టమనేని అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభిమానులు తీసుకువచ్చిన పలు కేక్‌లను సూపర్‌స్టార్ కృష్ణగారితో కలిసి ఆమె కట్‌చేశారు.
ఈ సందర్భంగా శ్రీమతి విజయనిర్మల గారు మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం కంటే మేం ఊహించినదానికంటే ఎక్కువవమంది అభిమానులు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. చిత్రాల జయాపజయాలతో సంబంధం లేకుండా అభిమానులు దశాబ్దాలుగా మాకు వెన్నంటే ఉన్నారు. మేము నటించిన శ్రీశ్రీ చిత్రం ఆడియో చాలా బాగుందని అభిమానులు అంటుంటే చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్రం మార్చిలో విడుదల కానుంది అన్నారు.
హీరో కృష్ణగారు మాట్లాడుతూ.. అభిమానుల సమక్షంలో మేము పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం మాకు ఎప్పుడూ ఆనంద దాయకమే. అభిమానులకు మేం ఎప్పుడూ రుణపడి ఉంటాం అన్నారు.
హీరో నరేష్ మాట్లాడుతూ.. అభిమానులు అందరూ కలిసిమెలిసి ఈ విధంగా కుటుంబ సభ్యుల పుట్టినరోజులు జరపడం మాకు ఎంతో ఉత్సాహం ఇస్తుంది. ఇది మాకు గర్వకారణం కూడా అన్నారు.
ఆలిండియా సూపర్‌స్టార్ కృష్ణమహేష్ సేన అధ్యక్షులు దిడ్డి రాంబాబు మాట్లాడుతూ.. శ్రీమతి విజయనిర్మల గారి జన్మదిన వేడుకలు ఇంత ఘనంగా జరగడానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అభిమానులకు ధన్యవాదాలు. ఇలాగే ఆమె మరిన్ని పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని కోరుకుంటున్నాం అన్నారు.
ఆలిండియా కృష్ణమహేష్ ప్రజాసేన అధ్యక్షలు ఖాదర్‌ఘోరీ మాట్లాడుతూ.. మేడవ్‌ుగారు అభిమానులను ఎప్పుడూ తమ కుటుంబ సభ్యులుగానే భావిస్తారు. ఆమె చూపే ఆదరణకు అభిమానులు ఎంతో రుణపడి ఉంటారు అన్నారు.
ఈ సందర్భంగా శ్రీమతి విజయ నిర్మల గారు 72 వేల రూపాయల చెక్‌ను మా అసోసియేషన్ నిమిత్తం అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ నరేష్‌కు అందజేశారు.
ఈ కార్యక్రమంలో అభిమానులు దిడ్డి రాంబాబు, పి. మల్లేష్, ఖాదర్‌ఘోరీ, మహ్మద్ జానీ, జితేందర్, పల్లె జంగయ్యగౌడ్, రాజారెడ్డి, బొడ్డుబాబు, సిద్ధిరాజు, బ్యాంకు రాజులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున విచ్చేసిన అభిమానులు శ్రీమతి విజయ నిర్మల గారికి శుభాకాంక్షలు తెలియజేశారు.

,  ,  ,