Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

11-May-2017 15:46:50
facebook Twitter Googleplus
Photo

యంగ్ హీరో విజయ్ దేవరకొండ మంచి స్పీడ్ మీదే ఉన్నాడు. తాజాగా ఈ హీరో పుట్టిన రోజు సందర్భంగా కొత్త సినిమా అనౌన్స్ కాగా.. గతంలోనే అనౌన్స్ అయిన ఓ ప్రాజెక్టుకు సంబంధించి కీలకమైన అప్డేట్ వచ్చింది. బన్నీ వాసు నిర్మాణంలో.. పరుశురామ్ దర్శకత్వంలో.. విజయ్ దేవరకొండ హీరోగా ఓ మూవీని గతంలోనే అనౌన్స్ చేశారు.

అయితే.. ఈ చిత్ర షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. హీరోయిన్ విషయంలో దర్శకుడు పరుశురామ్ ఏ మాత్రం ఛాన్స్ తీసుకోలేదు. శ్రీరస్తు శుభమస్తు అంటూ హిట్ కొట్టిన తర్వాత.. తన తర్వాతి మూవీ విషయంలో కూడా పరశురామ్ చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు. మొదట అనుపమా పరమేశ్వరన్.. ఆ తర్వాత కీర్తి సురేష్ లను ప్రయత్నించిన దర్శకుడు చివరకు మరో మలయాళ బ్యూటీ మడొన్నా3 సెబాస్టియన్ కు ఫిక్స్ అయ్యాడు.

ఇప్పటికే నాగచైతన్య సరసన తెలుగు ప్రేమమ్ లో నటించి ఆకట్టుకున్న ఈ భామ.. ఇప్పుడు విజయ్ దేవరకొండతో నటించనుంది.

,  ,  ,  ,