Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

25-Jul-2017 11:27:07
facebook Twitter Googleplus
Photo

సూపర్ స్టార్ మహేశ్ బాబు తన సినిమాల జోరు పెంచబోతున్నాడు. కొన్ని నెలలుగా స్పైడర్ సినిమా విడుదల పై రకరకాల కథనాలు మనం చూస్తున్నాం. ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తి కావడంతో ఇప్పుడు ఒక సెప్టెంబర్ లో దసరా సినిమాగా రాబోతుంది . కానీ మహేశ్ బాబు స్పైడర్ సినిమాకు సంబంధించి ఇంతవరకు ఎటువంటి ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టలేదు . ఇప్పుడు స్పైడర్ సినిమా ప్రమోషన్ వేగవంతం చేయడానికి అన్నీ సిద్దం చేస్తునట్లు తెలుస్తుంది.

ఆగష్టు 9 నాడు మహేశ్ బాబు పుట్టిన రోజు ఉంది ఆ రోజున అభిమానులును ఉత్సాహ పరచడానికి స్పైడర్ టీజర్ ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ సినిమా గా రూపొందిన ఈ సినిమా పై తెలుగు తమిళ్ అభిమానులలో భారీ అంచనాలే ఉన్నాయి. ఇదే రోజున స్పైడర్ టిజర్ తోపాటుగా కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న భరత్ అనే నేను సినిమా ఫస్ట్ లుక్ కూడా విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నారట. మహేశ్ బాబు స్పైడర్ టీజర్ - భరత్ అనే నేను సినిమాలో ఉండే యంగ్ పోలిటికల్ లీడర్ ఫస్ట్ లుక్ ఆగష్టు 9 నాడు వచ్చేస్తే.. అభిమానులు వావ్ అనుకోరు!!

శివ డైరెక్ట్ చేస్తున్న భరత్ అనే నేను సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరపుకుంటుంది. ఈ సినిమా వచ్చే సంక్రాంతి కి విడుదల చేస్తారు. భరత్ అనే నేను సినిమాలో మహేశ్ బాబు చీఫ్ మినిస్టర్ గా నటించబోతున్నాడు. ఈ సినిమా కోసం హైదరాబాద్ శివారులలో భారీ అసెంబ్లీ సెట్ కూడా నిర్మించారు.

,  ,  ,  ,  ,