Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

02-Apr-2015 10:39:56
facebook Twitter Googleplus
Photo

ప్రస్తుతం 'శ్రీమంతుడు' చిత్రం షూటింగులో బిజీగా వున్న మహేష్ బాబు తన తదుపరి చిత్రాన్ని శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో చేయడానికి ఓకే చెప్పాడు. పీవీపీ సినిమా నిర్మించే ఈ భారీ చిత్రానికి 'బ్రహ్మోత్సవం' అనే టైటిల్ కూడా అప్పుడే నిర్ణయించారు. కాగా, ఈ చిత్రం షూటింగును మే 31న హైదరాబాదులో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆ రోజు మహేష్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ చిత్రం షూటింగుకు శ్రీకారం చుట్టడానికి మహేష్ ప్లాన్ చేసుకున్నాడు. దర్శకుడు శ్రీకాంత్ ఫేవరైట్ సంగీత దర్శకుడు మిక్కీ జె మేయర్ దీనికి మ్యూజిక్ ఇస్తాడు. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా ఇప్పటికే ఎంపికైంది.

,  ,  ,  ,  ,