Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

10-Oct-2017 14:49:37
facebook Twitter Googleplus
Photo

మహేష్ బాబు విజయాన్ని చూసి చాలా కాలమే అవుతోంది. ఎన్నో ఆశాలు పెట్టుకొని ఒకేసారి తమిళ్ - తెలుగులో రిలీజ్ చేసిన స్పైడర్ ఫైనల్ గా మరో డిజాస్టర్ ని ఇచ్చేసింది. బ్రహ్మోత్సవం తర్వాత మరో డిజాస్టర్ రావడంతో మహేష్ చాలా నిరాశ చెందాడట. భరత్ అనే నేను సినిమా షెడ్యూల్ ని సైతం చెంజ్ చేసి ఫ్యామిలీతో కాస్త గడిపి ఆ ఫెయిల్యూర్స్ నుంచి బయటపడాలని చూస్తున్నాడట.

కొరటాల దర్శకత్వంలో - భరత్ అనే నేను సినిమా పూర్తి రాజకీయ నేపథ్యంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక సినిమాను ఒకే చేశాడు మహేష్. ఆ సినిమా యాక్షన్ - ఫ్యామిలీ తరహాలో ఉంటుందని సమాచారం. అయితే ఈ రెండిటి మధ్యలో మహేష్ ఓక స్పెషల్ రోల్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను - బాలకృష్ణతో ఒక సినిమాను ఒకే చేశాడు అయితే ఆ సినిమాలో కథను మలుపు తిప్పే పాత్ర కీలకం కానుందట. దీంతో మహేష్ తో ఆ స్పెషల్ రోల్ ని చేయించాలని బోయపాటి డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

కానీ ప్రస్తుతం మహేష్ ఉన్న పరిస్థితుల్లో ఆ సినిమాను ఒకే చేయగలడా అనేది కాస్త అనుమానంగానే ఉంది. మాస్ ఆడియెన్స్ పల్స్ తెలిసిన బోయపాటితో సినిమా చేయడానికి ఏ హీరో అయినా సిద్ధంగా ఉంటాడు. మరి బోయపాటి మహేష్ ని మెప్పించి ఒప్పిస్తాడా అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

,  ,  ,  ,  ,