Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

21-Jun-2016 10:48:57
facebook Twitter Googleplus
Photo

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కొన్ని విషయాల్లో స్ట్రిక్ట్ గా ఉంటాడు. అదే సమయంలో దర్శకుల హీరో అని కూడా అనిపించుకుంటాడు. పర్సనల్ గా తన ఇంట్రెస్టులను వదులుకునేందుకు ఇష్టపడని మహేష్.. ఒక వేళ డైరెక్టర్ అడిగితే మాత్రం ఏం చేసేందుకైనా రెడీ అంటాడు. అంటే.. ఇలా కావాలని మహేష్ ని అడగని దర్శకులదే తప్పంతా ఉంటుందన్న మాట.

సాధారణంగా మహేష్ బాబు క్లీన్ లుక్ తోనే కనిపిస్తాడు. కానీ త్వరలో ప్రారంభం కానున్న మురుగదాస్ చిత్రంలో మాత్రం కొంచెం గెడ్డం - మీసం పెంచి డిఫరెంట్ లుక్ లో రఫ్ గా దర్శనమిస్తాడట. ఈ మేరకు మేకోవర్ చూపించేందుకు మురుగదాస్ కు ఇప్పటికే తన అంగీకారం చెప్పేశాడు మహేష్. ఈ మూవీలో మహేష్ చేసే రోల్ కు.. సాఫ్ట్ అంతగా బాగోదని దర్శకుడు ఎక్స్ ప్లెయిన్ చేయడంతో.. గెడ్డం లుక్ తో కనిపించేందుకు మహేష్ సై అన్నాడని తెలుస్తోంది.

ప్రస్తుతం ఫ్యామిలీతో పాటు వెకేషన్ టూర్ లో ఉన్న మహేష్.. తిరిగి ఇండియాకి రాగానే ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు. ఇప్పటికే పరిణీతి చోప్రాను హీరోయిన్ గా ఫైనల్ చేయగా.. వచ్చే ఏడాది సమ్మర్ నాటికి కానీ.. మహేష్-మురుగదాస్ మూవీ రిలీజ్ అయ్యే అవకాశం లేదని తెలుస్తోంది. పిక్చరైజేషన్ కు దాదాపు సమానంగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ చేయాల్సి ఉండడమే ఇందుకు కారణం అనే టాక్ వినిపిస్తోంది.

,  ,  ,  ,  ,  ,  ,