Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

28-Nov-2016 10:53:40
facebook Twitter Googleplus
Photo

మహేష్ బాబు కుటుంబానికి ఏ స్థాయిలో ఇంపార్టెన్స్ ఇస్తాడో చూస్తుంటే.. ఏ స్టార్ కైనా ఆశ్చర్యం వేయకమానదు. తన ఫ్యామిలీకి సంబంధించిన ఏ చిన్న ఇన్సిడెంట్ ను మిస్ చేసుకోడు మహేష్. అలాగే ఫ్యామిలీ వెకేషన్స్ ప్లాన్ చేసుకోవడంలో కూడా సూపర్ స్టార్ స్పెషాలిటీ సూపర్ అంతే.

2016 పూర్తి కావచ్చింది. ఈ ఏడాది పూర్తి కావడనికి గట్టిగా ఇంకో నెల ఉందంతే. కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. మరి న్యూఇయర్ అంటే వెకేషన్స్.. టూర్స్.. ఎంజాయ్మెంట్స్ కంపల్సరీ. మరి మహేష్ బాబు ఈసారి ఎక్కడికి వెళుతున్నాడో తెలుసా? కొత్త ఏడాదిని భార్య నమ్రత.. కొడుకు గౌతమ్.. కూతురు సితారలతో కలిసి.. టూర్ వెళుతున్న మహేష్.. ఈ సారి యూకే ట్రిప్ ప్లాన్ చేశాడట. లండన్ తో పాటు పలు కంట్రీస్ నుంచి చుట్టేయనున్నాడని తెలుస్తోంది.

క్రిస్మస్ నాటికే లండన్ చేరుకోనున్న మహేష్.. న్యూయర్ డే కంప్లీట్ అయ్యేవరకూ అక్కడే ఉంటాడట. టోటల్ గా 10 రోజుల పాటు యూకే వెకేషన్ టూర్ వెళ్తున్నాడు మహేష్. తిరిగి వచ్చీ రాగానే మురుగదాస్ తో తీస్తున్న మూవీని ఫినిష్ చేసే పనిలో దిగిపోతాడు మహేష్. న్యూ ఇయర్ కి ఈ మూవీకి సంబంధించిన టీజర్ కూడా ఇచ్చే ప్లానింగ్ కూడా ఉందని తెలుస్తోంది.

,  ,  ,  ,  ,  ,