Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

20-May-2017 16:28:33
facebook Twitter Googleplus
Photo

అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కొద్దీ మహేష్ లేటెస్ట్ సినిమా స్పైడర్ అంతకంతకూ వెనక్కుపోతోంది. లాస్ట్ ఇయర్ బ్రహ్మోత్సవం వంటి బ్రహ్మాండమైన ఫ్లాప్ తో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఎన్నో ఆశలతో ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ గా పెట్టుకుని తీసిన ఈ సినిమా వారం కూడా తిరక్క ముందే థియేటర్ల నుంచి వెళ్లిపోయింది. ఈ చేదు అనుభవం నుంచి వీలైనంత త్వరగా బయటపడాలన్న ఉద్దేశంతో వెంటనే మురుగదాస్ డైరెక్షన్ లో స్పైడర్ సినిమా ఓకే చేశాడు. వైవిధ్యమైన అంశాలతో హీరోయిజం ఎలివేటయ్యాల ా సినిమాలు తీయడంలో మురుగదాస్ సిద్ధహస్తుడు. అందుకే ఈ సినిమా ఎప్పుడు రిలీజవుతుందా అని అభిమానులంతా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.

అనుకున్న ప్రకారం ఈ ఏడాది సంక్రాంతికి కానీ.. కుదరకపోతే సమ్మర్ ముందునాటికి సినిమా రిలీజ్ చేయాలని భావించారు. కానీ అనుకోని అవాంతరాలతో షూటింగ్ బాగా డిలే అయిపోయింది. ఈలోగా బాహుబలి థియేటర్లలోకి వచ్చేశాడు. విజువల్ గ్రాండియర్ గా తయారైన ఈ సినిమా అన్ని భాషల్లోనూ సూపర్ హిట్టయింది. దీంతో స్పైడర్ రిలీజ్ జూన్ కు వాయిదా పడింది. అయితే బాహుబలి సినిమాలోని గ్రాఫిక్స్ చూసిన తర్వాత మురుగదాస్ పునరాలోచనలో పడాల్సి వచ్చింది. స్పైడర్ సినిమాలోనూ హై క్వాలిటీ గ్రాఫిక్స్ ఉండాలని డిసైడ్ అయ్యాడట. దీంతో సినిమా జూన్ నుంచి ఆగస్టు ఆఖరుకు వాయిదా పడింది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి ఈ సినిమా సెప్టెంబర్ ఆఖరుకు కానీ ప్రేక్షకుల ముందుకు వచ్చేే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికే బ్రహ్మోత్సవం వచ్చి ఏడాది దాటిపోతోంది. అలాంటిది స్పైడర్ వాయిదాలపై వాయిదాలు పడటం అభిమానులకు రుచించడం లేదు.

తెలుగు తమిళంహిందీ భాషల్లో ఒకేసారి స్పైడర్ రిలీజ్ చేయాలన్నది నిర్మాతల ఆలోచన. సెప్టెంబర్ ఆఖరు నాటికి థియేటర్లు ఖాళీగా ఉంటాయన్న భరోసా లేదు. ఆ సమయంలో పోటీ ఎక్కువగా ఉంటుంది. ఫస్ట్ కాపీ రెడీ అవకుండా రిలీజ్ డేట్ ఎప్పుడో ఘంటాపథంగా చెప్పలేని పరిస్థితి. మరోవైపు అబిమానుల నుంచి పెరుగుతున్న ఒత్తిడితో సినిమా డిలే అవడంపై మహేష్ కూడా అసంతృప్తిగానే ఉన్నాడట.

,  ,  ,  ,  ,