Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

17-Apr-2017 13:15:42
facebook Twitter Googleplus
Photo

మహేష్ బాబు కొత్త సినిమా స్పైడర్ ఫస్ట్ లుక్ రీసెంట్ గానే రిలీజ్ అయింది. ఎన్నో నెలల పాటు ఎదురుచూస్తే.. సింపుల్ అండ్ స్టైలిష్ లుక్స్ తో సరిపెట్టేశాడు దర్శకుడు మురుగదాస్. ఈ విషయంలో ఫ్యాన్స్ కొంచెం అసంతృప్తిగా ఉన్నా.. టైటిల్ రివీల్ కావడంతో సంతృప్తి పడిపోయారు.

ఇప్పుడీ టైటిల్ విషయంలోనే కొత్త టెన్షన్స్ మొదలయ్యాయి. గత కొంతకాలంగా టాలీవుడ్ లో టైటిల్ ర్ అక్షరంతో ఎండ్ అయ్యే సినిమాలేవీ ఆడడం లేదు. ఇందుకు లోఫర్.. విన్నర్.. మిస్టర్ చిత్రాలను ఉదాహరణలుగా చెప్పుకుంటే.. ఇవన్నీ మెగా మూవీస్ అనే విషయాన్ని గుర్తించుకోవాలి. అయితే.. ఈ టైటిల్ సెంటిమెంట్ ను మహేష్ ఫ్యాన్స్ ఖండిస్తున్నారు. తమ హీరో మూవీకి అలాంటి సెంటిమెంట్స్ ఏవీ పని చెయ్యవని ధీమాగా చెప్పేస్తున్నారు. ఇందుకు మహేష్ మూవీస్ నే ఎగ్జాంపుల్ గా చూపిస్తుండడం విశేషం.

మహేష్ సినిమాల్లో డు అనే అక్షరం చివర్లో వచ్చే దూకుడు బ్లాక్ బస్టర్ అనే సంగతి తెలిసిందే. దానికి దగ్గరగానే ఉండే ఆగడు కానీ.. అంతకు ముందెపుడో వచ్చిన సైనికుడు కానీ.. డిజాస్టర్లుగా నిలిచాయి. అతడు మూవీ సిల్వర్ స్క్రీన్ పై యావరేజ్ అయినా.. స్మాల్ స్క్రీన్ పై బ్లాక్ బస్టర్ అయింది.

,  ,  ,  ,  ,