Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-Feb-2017 11:09:41
facebook Twitter Googleplus
Photo

ఇప్పుడంతా సినిమా సెట్స్ మీదికి వెళ్లడంతోనే ప్రమోషన్ మొదలైపోతుంది. కొన్ని రోజులకే ఆన్ లొకేషన్ పిక్స్ రిలీజ్ చేస్తారు. సినిమా ప్రోగ్రెస్ గురించి.. కొత్త షెడ్యూళ్ల గురించి ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇస్తారు. ఇవి బోర్ కొట్టేసే సమయానికి ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చేస్తుంది. ఆపై టీజర్ లాంచ్ చేస్తారు. ఐతే మహేష్ బాబు కొత్త సినిమా విషయంలో మాత్రం ఇలా జరగట్లేదు. ఆరు నెలలుగా ఈ సినిమాకు సంబంధించి ఏ విశేషం బయటికి రాలేదు. హైదరాబాద్ లో షూటింగని.. అహ్మదాబాద్ వెళ్లారని.. యాక్షన్ సీన్స్ తీస్తున్నారని.. ఇలాంటి బోరింగ్ అప్ డేట్స్ మాత్రమే బయటికి వస్తున్నాయి.

టైటిల్ అనౌన్స్ మెంట్.. ఫస్ట్ లుక్ లాంచ్.. ఇదిగో అదిగో అంటూ ఎప్పటికప్పుడు వార్తలు వినిపిస్తున్నాయి తప్ప ఇప్పటిదాకా ఆ ఊసే లేదు. ఇప్పటికి దాదాపు అరడజను డేట్లు మారి ఉంటాయి. దసరాకన్నారు.. దీపావళికన్నారు.. జనవరి 1 అన్నారు. 26 అన్నారు.. కానీ ఏ తేదీకి కూడా ఏ విశేషం బయటికి రాలేదు. దీంతో మహేష్ ఫ్యాన్స్ తీవ్ర అసహనానికి గురవుతున్నారు. మురుగదాస్ షూటింగ్ విషయంలో ఎంత బిజీగా అయినా ఉండొచ్చు. ఈ మధ్యలో కొంచెం సమయం వెచ్చిస్తే ఫస్ట్ లుక్ రెడీ అయిపోతుంది. ఈపాటికే టైటిల్ ఏదో అనుకుని ఉంటారు కాబట్టి.. లోగో డిజైన్ చేయించేసి ఆ ఫస్ట్ లుక్ అయినా రిలీజ్ చేసేస్తే అభిమానులు సంతృప్తి పడిపోతారు. ఆ తర్వాత కొంచెం గ్యాపిచ్చి టీజర్ లాంచ్ చేసుకోవచ్చు. ఈ విషయంలో మురుగదాస్ ఇబ్బంది ఏంటో మరి. బహుశా అతను పూర్తిగా సినిమా మీదే దృష్టిపెట్టి.. ఇంకే విషయాలూ ఆలోచించట్లేదేమో. ఫస్ట్ లుక్.. టీజర్.. అన్నీ స్పెషల్ గా ఉండాలని ఇప్పుడు వాటి జోలికి వెళ్లట్లేదేమో. జూన్ 23న సినిమా అంటున్నారు కాబట్టి ఇంకొంత ఆలస్యంగా ఈ విశేషాల్ని బయటపెడదామనుకుంటున్నారేమో.

,  ,  ,  ,  ,  ,