Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-Nov-2016 12:15:55
facebook Twitter Googleplus
Photo

మహేష్ బాబు.. సాధారణంగా స్పీడ్ గా సినిమాలు చేయడంపై పెద్దగా దృష్టి పెట్టినట్లుగా కనిపించడు. ఇన్నాళ్లూ ఇదే పద్ధతిని ఫాలో అయిన సూపర్ స్టార్.. సడెన్ గా రూట్ మార్చేసి వరుసగా సినిమాలు చేసేస్తుండడం ఆశ్చర్యానికి గురి చేసే విషయమే. ప్రస్తుతం దర్శకుడు మురుగదాస్ తో బై లింగ్యువల్ చేస్తున్నాడు. ఆ తర్వాత ముగ్గురు డైరెక్టర్లను లైన్ లో పెట్టడం.. అన్నిటికీ వరుసగా రిలీజ్ లు కూడా ప్లానింగ్ చేసేయడం షాకింగ్ అనే చెప్పాలి.

అత్యంత సన్నిహితుల ద్వారా తెలుస్తున్న వివరాల ప్రకారం.. డిసెంబర్ నాటికి మురుగ దాస్ సినిమా టాకీ పార్ట్ ను పూర్తి చేసేయనున్నాడు మహేష్. ఇక జనవరి నాటికే మొత్తం షూటింగ్ పూర్తయిపోయినా.. ఈ చిత్రం రిలీజ్ మాత్రం మే నెలలోనే అని ఇప్పటికే తేలిపోయింది. అయితే.. ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ కాగానే.. ఫిబ్రవరి నుంచి కొరటాలతో 'భరత్ అను నేను'(టైటిల్ పరిశీలిస్తున్నారని టాక్) మూవీ ని ప్రారంభించి.. మే నెలాఖరు కల్లా కంప్లీట్ చేసేస్తాడట. దీన్ని 2017 దసరా రిలీజ్ కు ప్లాన్ చేయగా.. ఆ వెంటనే జూన్ నుంచి వంశీ పైడిపల్లి మూవీ కూడా మొదలైపోనుందట.

మహేష్-వంశీల మూవీ 2018 సంక్రాంతి రిలీజ్ కు ప్లాన్ చేయగా.. ఆ సమయానికల్లా త్రివిక్రమ్ తో సినిమా ప్లాన్ చేశాడు సూపర్ స్టార్. 2018 దసరా నాటికి మహేష్-త్రివిక్రమ్ శ్రీనివాస్ ల సినిమా కూడా థియేటర్లలోకి వచ్చేలా ప్లానింగ్ చేశాడట. ఎక్కడా ప్లానింగ్ మాత్రం మిస్ కాకూడదని.. బడ్జెట్ ఎక్కువ అయ్యేందుకు వీలు లేదని తేల్చి చెప్పేసి.. అందుకు అనుగుణంగానే డేట్స్ కేటాయించాడని తెలుస్తోంది. మురుగ దాస్.. కొరటాల శివ.. వంశీ పైడిపల్లి.. ఆ తర్వాత త్రివిక్రమ్.. మహేష్ దర్శకుల లైనప్ చూస్తే వామ్మో అనిపించడం లేదూ!

,  ,  ,  ,  ,